ప్రతి విద్యార్థికి ఫీజురీయింబర్స్‌మెంట్ | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్థికి ఫీజురీయింబర్స్‌మెంట్

Published Sun, Sep 28 2014 1:09 AM

Each student fees reimbursement

టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి
రామాయంపేట: విద్య విషయమై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక స్నేహా డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం కల్పిస్తుందన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.  రాష్ట్ర జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు.

కళాశాలల కరస్పాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదన్నారు.  కళాశాల తరపున ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. గజ్వేల్ అనాథ ఆశ్రమం నిర్వహకులు ఇజ్రయిల్ మాట్లాడుతూ  అనాథాశ్రమానికి స్నేహ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం రూ. 45 వేల ఆర్థిక సహాయం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో  డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ సంతోష్‌శర్మ, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు బాజ గురువయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement