ప్రతి మండలంలో గోదాముల నిర్మాణం | Sakshi
Sakshi News home page

ప్రతి మండలంలో గోదాముల నిర్మాణం

Published Fri, May 22 2015 3:45 AM

ప్రతి మండలంలో గోదాముల నిర్మాణం - Sakshi

అధికారులకు హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అవసరమున్న ప్రతి మండలంలో గోదాములు నిర్మించాలని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రెండో దశ గోదాముల నిర్మాణం ప్రతిపాదనలను మార్కెటింగ్ శాఖ, నాబార్డ్ అధికారులు కలిసి యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని కోరారు. నాబార్డ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో గురువారం సచివాలయంలో గోదాముల నిర్మాణంపై ఆయన సమీక్ష జరిపారు.

తొలి విడత కింద రూ.1,023.98 కోట్ల నాబార్డు రుణం ద్వారా మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో భారీ ఎత్తున గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 128 మార్కెట్ యార్డుల్లో ఈ గోదాముల నిర్మాణం కోసం టెండర్లు పిలిచినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 6 నెలల్లో ఈ గోదాముల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

రెండో దశలో రూ.612 కోట్ల రుణంతో మండల కేంద్రాల్లో గోదాముల నిర్మాణానికి నాబార్డుతో చర్చించినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ కొత్త గోదాములకు అవసరమైన భూముల సేకరణను పూర్తి చేయాలని అధికారులను కోరారు. త్వరలో మొదటి దశ, రెండో దశ గోదాముల నిర్మాణంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తానని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement