ప్రశాంతంగా ఎంసెట్ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎంసెట్

Published Fri, May 23 2014 2:57 AM

eamcet exams held peace fully

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, వనపర్తి టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంతోపాటు వనపర్తిలో గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మెడిసిన్‌లో 3,604 మంది, ఇంజనీరింగ్ 5,084 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను, వనపర్తి పాలిటెక్నిక్, బాలికల ఉన్నత పాఠశాల, పురుషల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్ల్రాను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శర్మన్, జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుధాకర్‌లు సందర్శించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, హాజరు తదితర వివరాలను పరీక్షా కేంద్రం పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు.
 
 ఉదయం జరిగిన ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు 7 కేంద్రాల్లో 4,215 మంది విద్యార్థులకు గాను 285 మంది గైర్హాజరవ్వగా 3,930 మంది పరీక్షలకు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మెడికల్ విభాగం పరీక్షకు 6 కేంద్రాల్లో మొత్తం 3,061 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 237 మంది గైర్హాజరవ్వగా 2,824 మంది పరీక్షలు రాశారు. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో పదినిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థినికి అనుమతించలేదు. కేంద్రాల వద్ద పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్రాల వద్ద రద్దీ బాగా కనిపించింది.  
 
 వనపర్తి పట్టణంలోనూ ఎంసెట్ ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 1237 మంది విద్యార్థులకు 1154 మంది హాజరయ్యారు. 83 మంది ైగె ర్హాజరయ్యా రు.
 
 అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సా యంత్రం 5.30 వరకు పాలిటెక్నిక్, ప్రభు త్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నిర్వహిం చిన మెడిసిన్ విభాగం పరీక్షకు 822 మంది విద్యార్థులకు 780 మంది హాజరయ్యా రు. ఉస్మానియా యూనివర్సిటీ  ప్రొఫెసర్ భాస్కర్‌ను ఎన్‌పోర్స్‌మెంట్ అధికారిగా వచ్చారు. పలు పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్‌లు లేక విద్యార్థులు ఇబ్బందుల నడుమ పరీక్షలు రాశారు. వనపర్తి రీజినల్ కో-ఆర్డినేటర్ కుమారస్వామి పరీక్షలను పర్యవేక్షించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement