జర్నలిజంతో ఉపాధి అవకాశాలు | Sakshi
Sakshi News home page

జర్నలిజంతో ఉపాధి అవకాశాలు

Published Sat, Jun 21 2014 4:22 AM

Employment opportunities for journalism

కేయూ క్యాంపస్ : జర్నలిజం కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కాకతీయ యూని వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి తెలిపారు. కేయూలో రెగ్యులర్ ఎంసీజే ప్రవేశపెట్టిన తర్వాత మొదటి బ్యాచ్ కోర్సు ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా దూరవిద్యా కేంద్రంలోని సెమినార్‌హాల్‌లో శుక్రవారం విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఫేర్‌వెల్ సమావేశంలో రామస్వామి ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

జర్నలిజం విద్యార్థులు  గ్రామీ ణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రాజారాం మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలన, ప్రశ్నించేతత్వం అవసరమని తెలిపారు. సమావేశంలో కేయూ జర్నలిజం విభాగం కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్, అధ్యాపకులు ఎ.సంపత్‌కుమార్, భూక్యా దేవేందర్, కె.నర్సింహరాములు పాల్గొన్నారు.

Advertisement
Advertisement