రాత్రికి రాత్రే ఎలా తప్పిస్తారు? | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే ఎలా తప్పిస్తారు?

Published Fri, Aug 22 2014 12:14 PM

engineering colleges object deaffliating from jntu

ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితా నుంచి కొన్ని కాలేజీలను తొలగించడంపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జాబితా నుంచి తమ కాలేజీల పేర్లను తొలగించారని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల తరఫు న్యాయవాది వాదించారు. చిన్న చిన్న లోపాలు ఉన్నంతమాత్రాన అఫిలియేషన్ జాబితా నుంచి జేఎన్టీయూ ఎలా తొలగిస్తుందని ఆయన ప్రశ్నించారు. పైపెచ్చు, ఏవైనా లోపాలుంటే విద్యాసంవత్సరానికి ముందే వాటిపై జేఎన్టీయూ నోటీసులు ఇవ్వాల్సి ఉందని అన్నారు.

రాత్రికి రాత్రే జాబితా నుంచి తొలగించడం చట్టవిరుద్ధమని, అలా చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని న్యాయవాది చెప్పారు. జేఎన్టీయూ తాను రూపొందించిన విధానాలను తానే ఉల్లంఘిస్తోందని, కౌన్సెలింగ్‌కు ఈ నెల 26 వరకు మాత్రమే సమయం ఉందని చెప్పారు. ఏఐసీటీఈ ఈ విద్యాసంవత్సరానికి అనుమతిచ్చినా కూడా జేఎన్టీయూ అఫిలియేషన్ జాబితా నుంచి తొలగించడం చట్ట విరుద్ధమని వాదించారు.

Advertisement
Advertisement