ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Published Sun, Jul 9 2017 9:02 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య - Sakshi

తండ్రి ఉండగానే కళాశాల భవనం పై నుంచి దూకి అఘాయిత్యం
ఇబ్రహీంపట్నం: ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి కళాశాలలో ఉండగానే ఆ భవనం పై నుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.   రంగారెడ్డి జిల్లా బాలపూర్‌ మండలం గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీకి చెందిన కె. బాలవెంకట నాగచైతన్య (20) శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందూ ఇంజనీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ మూడో సంవత్సరం చదువు తున్నాడు. ఇతని తండ్రి శ్రీనివాస్‌ పోలీసు శాఖలో సిటీ సౌత్‌జోన్‌ ఎస్‌బీగా పనిచేస్తున్నారు. మొదటి, రెండవ సంవత్సరాల్లో 18 సబ్జెక్టుల్లో నాగ చైతన్య ఫెయిల్‌ అయ్యాడు.

మూడవ సంవ త్సరంలో ప్రమోట్‌ చేసేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో కుమారుడిని వెంటబెట్టుకుని తండ్రి శ్రీనివాస్‌ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌ మల్లేశం, హెచ్‌వోడీ∙శ్రీనివాసులు.. విద్యార్థి నాగ చైతన్యకు తండ్రి ముందే కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ సందర్భంలో చైతన్యను గది నుంచి బయటకు పంపించి తండ్రితో వారు మాట్లాడుతు న్నారు. దీంతో మనస్తాపానికి గురైన నాగ చైతన్య కళాశాలలోని మెకానికల్‌ భవనం మూడో అంతస్తు పైనుంచి కిందకు దూక డంతో తీవ్ర గాయాలయ్యాయి.  కామి నేని అస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

నేనే తీసుకొచ్చా: తండ్రి శ్రీనివాస్‌
తన కుమారుడిని మృత్యుకుహరంలోకి తానే తీసుకొచ్చానంటూ నాగ చైతన్య తండ్రి శ్రీనివాస్‌ విలపిస్తూ చెప్పారు.  కుమారుడిని వెంటబెట్టుకొచ్చి.. శవంతో ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏ తండ్రికీ రావద్దని కన్నీరుమున్నీరయ్యారు. బాబుకు సంబంధించి విద్యాపరమైన సమాచారాన్ని కళాశాల యాజమాన్యం ఏనాడూ తెలుపలేదని. కేవలం ఫీజు చెల్లించాలంటూ మాత్రమే మెసేజ్‌లు వచ్చేవని ఆయన చెప్పారు.

రెండు నెలల్లో ఇద్దరి ఆత్మహత్య
గత నెలలో ఇదే కశాశాల విద్యార్థిని రోష్ని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement