నెలకు సరిపడా మందులు ఒకేసారి

18 Jun, 2019 02:54 IST|Sakshi

బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా మందులు l

ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బీపీ, షుగర్‌ రోగులకు ఒకేసారి నెలకు సరిపడా మందులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్‌ అనంతరం రక్తపోటు, మధుమేహ వ్యాధులకు నెలకు సరిపడా మందులిచ్చే కార్యక్రమం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాదు వారి జీవిత కాలమంతా ఈ మందులను ఉచితంగా అందించనున్నారు. 

కొనసాగుతోన్న వైద్య పరీక్షలు 
ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ)పై స్క్రీనింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. అలాగే జూన్‌ చివరి వారం లేదా జులై మాసంలో మరికొన్ని జిల్లాల్లో ఎన్‌సీడీ స్క్రీనింగ్స్‌ చేపట్టబోతున్నారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ అసంక్రమిత జబ్బుల పరీక్షలను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ గట్టి పట్టుదలతో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కూడా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. గ్రామాల్లో ఆశా, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

మందులు చాలక అవస్థలు 
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 104 వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మందు గోలీలు ఇస్తున్నారు. వారానికో పదిరోజులకో సరిపోయేంత మాత్రమే ఇస్తున్నారు. దీంతో 104 ఇచ్చే మందుల మీదే ఆధారపడ్డ పేద రోగులు మళ్లీ మందులు వచ్చేదాకా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాక ప్రస్తుతం స్క్రీనింగ్‌ జరిగే జిల్లాల్లో బీపీ ఎక్కువగా ఉన్నవారికి , షుగర్‌ లెవల్స్‌ అసాధారణంగా ఉన్నవారికి ఈ డోసులు సరిపోవడం లేదని, అందుకే వారికి బయటనుంచి ట్యాబ్లెట్స్‌ కొనుక్కోమని చెబుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 

మందుల పంపిణీ బాధ్యత ‘ఆశ’లదే 
బీపీకి రెండు రకాలు, షుగరుకు మూడు రకాల గోలీలు వైద్య ఆరోగ్యశాఖ ఇవ్వబోతోంది. బీపీకి 50 ఎంజీ , 20 ఎంజీ డోసులతో కూడిన ట్యాబ్లెట్లను ఇస్తారు. ప్రతి నెలా మందులు అయిపోయాక వాటిని తిరిగి తెచ్చి ఇచ్చే బాధ్యత స్థానిక ఆశ కార్యకర్తలకు అప్పగించారు. స్థానికంగా ఉండే ఆశ కార్యకర్తల వద్దే ఆ గ్రామంలో ఎంతమంది బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే డేటా ఉంటుంది. దాని ఆధారంగా ప్రతి నెలా మందులు ఇవ్వనున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదు’

కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు

ఆకాశంలో సైకిల్‌ సవారీ

రయ్‌.. రయ్‌

విద్యార్థినిపై హత్యాయత్నం

వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ 

ఎంజాయ్‌ ఏమాయె!

ఇదో ఒప్పంద దందా!

గుట్కా@ బీదర్‌ టు హుజూరాబాద్‌ 

ఆలియాభట్‌ లాంటి ఫేస్‌ కావాలని..

పట్టాలపై నిలిచిపోయిన మెట్రో

ఇంటి పర్మిషన్‌ ఇ‍వ్వలేదని కిరోసిన్‌ పోసుకున్న మహిళ

పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

సమస్యలు తీర్చని సదస్సులెందుకు..?

డిసెంబర్‌లోగా కొత్త కలెక్టరేట్‌

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

ప్రాణం కాపాడిన ‘100’

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

జయం మాదే అంటున్న స్థానిక నేతలు !

చిన్నారిని అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

కలెక్టర్‌ కట్టె పట్టినా అంతే!

తల్లిని చంపాడని తండ్రిని చంపాడు!

పట్టా.. పరేషాన్‌

రైతుల పడరాని పాట్లు..

రెఫర్‌ చేయడం తగ్గించండి 

మా ఊళ్లో మద్యం వద్దు !

మానని గాయానికి ఐదేళ్లు...

క్యాన్సర్‌ సోకిందని కన్న తండ్రిని..

కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత

కొడుకు పాఠశాలకు వెళ్లడం లేదని..100కు డయల్‌ చేసిన తల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

ప్రతి రోజూ పరీక్షే!