ఆరు నెలల్లో మళ్లీ దసరా... | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో మళ్లీ దసరా...

Published Fri, Oct 23 2015 11:48 PM

ఆరు నెలల్లో  మళ్లీ దసరా... - Sakshi

ఇళ్లు కట్టి..పండగ చేసుకొందాం
- 6 నెలల్లోపే నిర్మాణం పూర్తి: సీఎం
- ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
- ఒకేసారి గృహప్రవేశం చేద్దాం..
- అంకాపూర్‌ను మించేలా అభివృద్ధి
- డ్రిప్పు ద్వారానే సాగు చేయాలని రైతులకు సూచన

జగదేవ్‌పూర్: ఎర్రవల్లి, నర్సన్నపేటలను అద్భుత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇటు గ్రామాభివృద్ధితో పాటు అటు వ్యవసాయాభివృద్ధి ఒకేసారి జరగాలని ఆకాంక్షించారు. ఐదున్నర నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అందరం ఒకేసారి గృహప్రవేశం చేద్దామన్నారు. గురువారం దసరా పర్వదిన వేళ తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలు అదృష్టవంతులన్నారు. రెండు గ్రామాల ప్రజల చైతన్యం ఎంతో గొప్పదన్నారు. ఐక్యమత్యంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
 
వ్యవసాయాభివృద్ధి ఎంతో ముఖ్యం
గ్రామాల అభివృద్ధి ఎంత ముఖ్యమో వ్యవసాయాభివృద్ధి అంతకంటే ముఖ్యమని సీ ఎం కేసీఆర్ అన్నారు. ప్రతి రైతుకు డ్రిప్పు సౌకర్యం కల్పిస్తామని, బోర్లు వేయిస్తామని చె ప్పారు. అంకాపూర్‌ను మరిపించేలా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను తీర్చిదిద్దుతామన్నా రు. జిల్లాలోని పాములపర్తి రిజర్వాయర్‌కు కొండపోచమ్మసాగర్ అనీ, సిద్ధిపేట ప్రాంతం లో నిర్మించే రిజర్వాయర్‌కు కొమురెళ్లి మల్లన్నసాగర్ అనీ పేర్లు పెట్టామన్నారు. రెండు రిజ ర్వాయర్లను త్వరగా పూర్తి చేసి మెదక్, నల్లగొం డ, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరందిస్తామన్నారు. ఆరు నెలల్లో ఇంటింటికీ నల్లా కలెక్ష న్ ద్వారా తాగునీరందిస్తామన్నారు. నీటి నిల్వ కోసం కూడవెళ్లి వాగును అభివృద్ధి చేసి అక్కడక్కడా చెక్‌డ్యాంలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పొలాల వద్ద భారీ కుం డీలు ఏర్పాటు చేసుకుని నీరు నిల్వ చేసుకోవాలని సూచించారు. చేబర్తి నుంచి ఇటిక్యాల వర కు వాగును నీటి నిల్వకు అనువుగా పటిష్టం చే స్తామన్నారు. ఈ పనులు వారంలోపు మొదలు పెట్టాలని కలెక్టర్, జేసీలను ఆదేశించారు.  
 
వందశాతం డ్రిప్పుతోనే సాగు
రెండు గ్రామాల్లో రైతులు వందశాతం డ్రిప్పు సౌకర్యం ద్వారానే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. బోర్లు లేని ప్రతి రైతుకు బో ర్లు వేయించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. డ్రిప్పును ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రెం డు గ్రామాల్లో ఎంత డ్రిప్పు అవసరమో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌లోపు సర్వేలు పూర్తి కావాలని, ప్రతి రైతు పొలం వద్ద కుండీలు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  
 
485 ఇళ్లకు శంకుస్థాపన
ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో సీఎం కేసీఆర్ 485 ఇ ళ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన శిలాఫ లకాన్ని ఆవిష్కరించారు. ఎర్రవల్లిలో 285, న ర్సన్నపేటలో 200 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ని ర్మించనున్నారు. ఆరు నెలల్లోపు ప్రాజెక్టును పూ ర్తి చేసి విజయం సాధించాలని, అప్పుడు మళ్లీ దసరా పండుగ చేసుకుందామన్నారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి కంపెనీ ప్రతినిధులను సీఎం ఆదేశించారు. గడువులోగా పూర్తి చేస్తే ఇక్కడే మిమ్మల్ని సన్మానిస్తామన్నారు.
 
దసరా సంబరాల్లో సీఎం
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం జమ్మి ఆకులు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement