'ఎలాంటి మచ్చ లేకుండా పని చేస్తా' | Sakshi
Sakshi News home page

'ఎలాంటి మచ్చ లేకుండా పని చేస్తా'

Published Wed, Jun 4 2014 10:42 AM

Etela Rajendar takes charge as Finance minister ...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో డీ బ్లాక్లో బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా  వెనుకాడేది లేదని, ఒక్క రైతు నష్టపోకుండా చూస్తామన్నారు.

 ఎన్నికల  మేనిఫెస్టో అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈటెల స్పష్టం చేశారు. బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీ విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. ఎలాంటి మచ్చ లేకుండా పని చేస్తానని ఈటెల అన్నారు. కాగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటెలకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు.

 

Advertisement
Advertisement