నేడే శోభాయాత్ర | Sakshi
Sakshi News home page

నేడే శోభాయాత్ర

Published Mon, Sep 8 2014 3:14 AM

నేడే శోభాయాత్ర - Sakshi

 - వినాయకుడి వీడ్కోలుకు అంతా సిద్ధం
 - నాలుగు చోట్ల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు
 - బందోబస్తులో 1,483 మంది పోలీసులు
 - సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
 - రెండురోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్
 నిజామాబాద్ క్రైం: పదకొండు రోజులపాటు భక్త జనుల నుంచి విశేష పూజలందుకున్న గణేశుడు సోమవారం నిమజ్జనానికి తరలనున్నాడు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసు లు భారీగా బలగాలను రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను కనిపెట్టనున్నారు.

నిజామాబాద్ నగరం, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణాలతోపాటు మండలాలు, గ్రామాలలో సోమవారం నిమజ్జన యాత్ర కొనసాగనుంది. కామారెడ్డిలో ఆదివా  రం రాత్రే శోభాయాత్ర ప్రారంభమైంది. నగరంలో నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇ క్కడ 649 మంది పోలీసులను భద్రత కోసంనియమించగా, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణాలతో పాటు నిమజ్జనం జరిగే వివిధ ప్రాంతాలలో  834 మందిని బందోబస్తు విధులకు కేటాయించారు.
 
జిల్లా కేంద్రంలో ప్రధాన ఊరేగింపు
జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుంచి పగలు 1.30కు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. నిజామాబాద్ ఎంపీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ సుజాత జెండా ఊపి రథాన్ని ప్రారంభిస్తారు. గుర్బాబాది రోడ్డు, రైల్వే గేట్, గాంధీ గంజ్, ఒకటవ పట్టణ ఠాణా, గాంధీ చౌక్, నెహ్రూపార్కు, బోధన్ బస్టాండ్, అహమద్‌బజార్, గురుద్వార, పెద్దబజార్ వాటర్ ట్యాంక్, పెద్దబజార్ చౌరస్తా, ఆర్య సమాజ్, గోల్ హన్మాన్, పులాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని గణపతుల బావి వరకు శోభాయాత్ర చేరుకుంటుంది.
 
నాలుగు చోట్ల నిమజ్జనం
జిల్లా కేంద్రంలో నెలకొల్పిన గణేశ్ విగ్రహాలను నాలుగు చోట్ల నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చిన్న, మధ్యతరహా గణపతులను వినాయక్‌నగర్ గణపతుల బావిలో నిమజ్జనం చే స్తారు. పెద్ద విగ్రహాలను నగర శివారులోని బోర్గాం (పి) వాగు లో నిమజ్జనం చేస్తారు. భారీ విగ్రహాలను ఎడపల్లి మండలం జాన్కకం పేట్ గ్రామ సమీపంలో అశోక్‌సాగర్, బాసర గోదావరి నదికి తరలిస్తారు.  
 
మద్యం అమ్మకాలు బంద్
నిమజ్జనం సందర్భంగా జిల్లాలో సోమవారం మద్యం అమ్మకాలను నిషేధించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం కూడా మద్యం అమ్మకాలు ఉండవు. ఆరోజు జెండా బాలాజీ తీర్థయాత్ర ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement