జూలు విదిల్చిన ఎక్సైజ్ అధికారులు | Sakshi
Sakshi News home page

జూలు విదిల్చిన ఎక్సైజ్ అధికారులు

Published Fri, Aug 21 2015 11:56 PM

excise officials attack

వికారాబాద్ రూరల్ : ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన ఎక్సైజ్ అధికారులు రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కసారిగా జూలు విదిలించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వికారాబాద్ మండలంలోని దన్నారంతండా, అనంతగిరిపల్లి, బురాంతపల్లితండా, మన్నెగూడతండాల్లో నాటుసారా తయారీదారులపై విస్తృత దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే వారికి చేదు అనుభవం ఎదురైంది. ఎక్సైజ్ అధికారులను చూసి న దన్నారంతండావాసులు ఏకంగా రాళ్ల వర్షం కురిపిం చారు. ఆ రాత్రిలో ఎవరు ఏమి చేస్తున్నారో తెలియక ఎక్సైజ్ పోలీసులు వెనుదిరిగారు.

తిరిగి ఉదయం లేవగానే ఆ తండాకు ఎక్సైజ్ సీఐ సుధాకర్, ఎస్‌ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది వెళిక్ల ప్రతి ఇంటికి క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ పాడుబడ్డ ఇంటిలో 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి తయారీ సామగ్రి బయట పడేశారు. దీంతో తండావాసులు ఒక్కసారిగా వారితో వాగ్వాదానికి దిగారు. నాటుసారా అమ్మి పిల్లలను చదివించుకుంటామని అనడం సరైన పద్ధతి కాదని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఎలాంటి లెసై న్సు లేకుండా అక్రమంగా తయారుచేసి విక్రయిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. అలాగే బురాం తపల్లితండా, మన్నెగూడతండాలో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement