నకిలీ కరెన్సీ ముద్రించే ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ ముద్రించే ముఠా అరెస్ట్

Published Mon, Mar 9 2015 5:37 PM

fake currency printing gang arrested

వరంగల్ : నకిలీ కరెన్సీని ముద్రించి చెలామణిలోకి తెస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వరంగల్ లో దొంగ నోట్లను ముద్రించే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  పోలీసులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement