అప్పులబాధతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Published Sun, Mar 5 2017 7:14 PM

Farmer suicide attempt in ankena village

ఖానాపూర్‌(ఆదిలాబాద్‌ జిల్లా): అప్పు చేసి కొడుకును విదేశాలకు పంపాడు... విదేశాలకు వెళ్లిన కొడుకు అప్పు చేసిన డబ్బులు తిరిగి పంపుతాడని ఆశపడ్డాడు. కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు, కొడుకు కల కోసం చేసిన అప్పు ఎక్కి మీద కూర్చొవడంతో ఆత్మహత్యనే ఇక దిక్కని ఆదివారం ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.
 
 పెంబి మండలం అంకెన  గ్రామానికి చెందిన గుగులోత్‌ కిషన్‌(48) అనే రైతు కరెంటు తీగలు ముట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి విదేశాలకు వెళ్లి రూపాయి సంపాదించి ఇవ్వక పోవడంతో మనస్తాపానికి లోనై చనిపోవాలని భావించి  ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement