అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Sat, Jul 4 2015 1:43 AM

farmer suicides for loans

వరంగల్: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు తనకున్న పొలంలో పంట వేసేందుకు తెలిసిన వారి వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా.. మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

విద్యుత్ షాక్తో రైతు మృతి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గొల్లపల్లిలో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందాడు. తనకున్న పొలంలో నీళ్లు కట్టేందుకు వెళ్లిన ఆయనను మృత్యువు కరెంటు రూపంలో వెంటాడింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ ఘటనలకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Advertisement
Advertisement