ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్షం | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్షం

Published Mon, Jun 16 2014 1:35 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్షం - Sakshi

నేడు పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
 
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు విధివిధానాలు చర్చించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ఆరుగంటలకు అసెంబ్లీ సీబ్లాక్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్‌లీడర్లకు ఆహ్వానం పంపారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల్లో విపక్షాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ‘ఇక్కడ చదువుకునే ఆంధ్ర విద్యార్థులకు మన మెందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయా’లని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రవేశాలు జరిగే సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయడం, అందుకు అవసరమైన సాంకేతిక కసరత్తు.. ప్రాథమిక సమాచార సేకరణ తదితర అంశాలు సోమవారం నాటి అఖిల పక్ష సమావేశంలో చర్యకు రానున్నాయి. గత సంవత్సరానికి సంబంధించి కూడా కళాశాలలకు వెయ్యి కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఈ బకాయిల పరిస్థితిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.   

 సమీక్షలతో కేసీఆర్ బిజీబిజీ

 సీఎం కేసీఆర్ అదివారం బిజిబిజీగా గడిపారు. ఉదయం నుంచే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ వినోద్‌లతో పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లారు.
 
 పండుగలకు పకడ్బందీ బందోబస్తు: ముఖ్యమంత్రితో డీజీపీ

 
హైదరాబాద్: వచ్చే రంజాన్, బోనాల పండుగల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాచర్యలు, పోలీసు బందోబస్తుపై వుుఖ్యవుంత్రి కేసీఆర్ ఆదివారం డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డిలతో చర్చించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జూలై 1 నుంచి నెల రోజుల పాటు రంజాన్ పర్వదినం ఉపవాసదీక్షలు, అదే నెలలో ప్రారంభవుయ్యే బోనాల  ఉత్సవాల కోసం బందోబస్తు ఏర్పాట్లను వుుఖ్యవుంత్రికి వివరించారు. పాతబస్తీతోపాటు కీలకమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నావుని, సంఘవిద్రోహ శక్తులు, అవాంఛనీయ శక్తులపై ఇప్పటినుంచే కన్నేసి ఉంచావుని అధికారులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, గూండాలు, కమ్యూనల్ గూండాలపై  కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, బందోబస్తు కోసం ఎంతవుందినైనా వినియోగించాలని, నగరంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని వుుఖ్యవుంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను అదేశించారు. హైదరాబాద్ నగరాన్ని  ప్రశాంతంగా  ఉంచాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, దానిని గమనంలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీ, నగర సీపీలకు సూచించారు. రంజాన్, బోనాల పండుగలకు సంబంధించి సోవువారం జరిగే కో-ఆర్డినేషన్ కమిటీ సవూవేశంలో శాంతిభద్రతల పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా డీజీపీ, సీపీలు వుుఖ్యవుంత్రికి వివరించినట్టు సవూచారం. కాగా రంజాన్, బోనాల పండుగల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాట్లను ముఖ్యమంత్రి సోమవారం మద్యాహ్నం సమీక్షించనున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, మేయర్, ఎంపీలు, అధికారులు పాల్గొంటారు.
 
 
 

Advertisement
Advertisement