Sakshi News home page

ఖమ్మంలో తెలుగుతమ్ముళ్లు డిష్యూం డిష్యూం

Published Sun, May 18 2014 2:05 PM

ఖమ్మంలో తెలుగుతమ్ముళ్లు డిష్యూం డిష్యూం - Sakshi

ఖమ్మం జిల్లాలో టీడీపీ వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. ఖమ్మం పట్టణంలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యాలయంలో ఆదివారం జిల్లాలోని పలువురు నేతలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా తమ ఓటమికి పార్టీలోని వర్గ పోరు కారణమని తుమ్మల నాగేశ్వరరావు, భద్రచలం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫణీశ్వరమ్మ వాపోయారు. దాంతో ఆ సమావేశానికి వచ్చి మరో నేత వల్ల ఇలా జరిగిందని తుమ్మల వర్గీయులు సదరు నేతపై దాడికి దిగారు.

 

అక్కడే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వారిని వారించేందుకు ప్రయత్నించాడు. దాంతో తుమ్మల వర్గీయులు ఆయనపై కూడా దాడికి దిగారు. దాంతో కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తల చేతుల్లో చిక్కుకుని ఉన్న ఎమ్మెల్సీ బాలసానిని  విడిపించి అక్కడినుంచి పంపేశారు. అయితే  కార్యాలయంలో ఇంత జరుగుతున్న తుమ్మల మాత్రం ఇవేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఆ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ ఆజయ్ చేతితో ఓటమి పాలైయ్యారు.

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement