వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

Published Sun, Apr 24 2016 5:12 PM

Fire accident in Clothes showroom

మిర్యాలగూడ అర్బన్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డులో ఓ వస్త్ర దుకాణంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శివసాయి నైటీస్ సెంటర్‌ను ఆదివారం ఉదయం కొద్దిసేపు తెరిచి ఉంచిన నిర్వాహకులు అనంతరం మూసివేసి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత షాపులో షార్ట్‌సర్క్యూట్ తో మంటలు మొదలయ్యాయి. ఈ ప్రమాదంలో షాపులోని వస్త్రాలన్నీ కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement