బోధన్ స్కామ్‌లో ఐదుగురు నిందితుల గుర్తింపు | Sakshi
Sakshi News home page

బోధన్ స్కామ్‌లో ఐదుగురు నిందితుల గుర్తింపు

Published Sat, Mar 4 2017 3:51 AM

బోధన్ స్కామ్‌లో ఐదుగురు నిందితుల గుర్తింపు - Sakshi

వీరి కోసం గాలిస్తున్నామన్న ఐజీ సౌమ్యామిశ్రా

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్‌ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాలో్లకి మళ్లించిన బోధన్  కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌ దర్యాప్తును సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని నిందితులుగా గుర్తిం చినట్లు ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం తెలి పారు. వీరిలో ముగ్గురు కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులుండగా... ఇద్దరు దళారులని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఓ ఉదంతంలోనే రూ.3.39 కోట్లు స్వాహా అయినట్లు గుర్తించామని మిగిలిన ఉదంతాల్లో గుర్తించా ల్సుందని పేర్కొన్నా రు.

ఈ కేసు దర్యాప్తులో అనేక ఖాతాలను సరిచూడాల్సి ఉందని, దీంతో కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగం నుంచి నోడల్‌ అధికారి, కొందరు సహాయకులను నియమించామని పేర్కొన్నారు. నమో ఫౌండేషన్  పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్న అంకిత్‌ మెహతాపై ఆశిష్‌ జైన్ న ఫిర్యాదు మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేశామని ఐజీ తెలి పారు. తన తల్లి సరోజ జైన్ నుంచి మెహతా రూ.12.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ (పీఎంఓ) పలుకుబడి ఉన్నట్లు బాధితులకు చెప్పాడని, దీంతో వారు సీఐడీలో ఫిర్యాదు చేయడంతో పాటు పీఎంఓకూ లేఖ రాశారన్నారు. ఈ మోసానికి, ఫౌండేషన్ కు సంబంధం లేదని, అయితే బాధితులు మాత్రం ఆ సంస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే మెహతాకు నగదు ఇచ్చినట్లు చెప్తున్నారని సౌమ్యామిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కూడా దర్యాప్తు స్థితిలో ఉందని వివరించారు. ఎంసెట్‌ లీకేజ్‌ స్కామ్‌లో ఇప్పటికే అనేక మంది నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పిన ఐజీ బీహార్‌ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్‌లో కీలక నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement