- మున్సిపాలిటీ కార్యాలయానికి మూఢనమ్మకం బెడద
- కూల్చివేశారు.. వదిలేశారు..
- నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో..?
- కనీస సౌకర్యాలు లేక మహిళా ఉద్యోగుల ఇబ్బందులు
సంగారెడ్డి మున్సిపాలిటీ: మున్సిపల్‌కు సైతం వాస్తు దోషం పట్టుకుంది. దీంతో కార్యాలయం కుడివైపున ఉన్న గదులను కూల్చి వేశారు. కానీ ఇంత వరకు వాటిని పూర్తి చేయకపోవడంతో కార్యాలయ సిబ్బంది తో పాటు సామాన్యులు సైతం కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.
సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీ కార్యాలయంలోని మున్సిపల్ కమిషనర్ చాంబర్ పక్కన (స్టోర్) గదిలో ఉన్న భవనంతో పాటు మూత్రశాలలను సైతం కూల్చి వేశారు. ఇందుకు కార్యాలయం ఎడమవైపున ఎల్ల మ్మ ఆలయం ఉండటంతో అటు వైపునే మూత్రశాలలు ఉండటం వల్లే కార్యాలయానికి అచ్చిరావడం లేదని కార్మికులు, సిబ్బంది పాలకవర్గం దృష్టికి తీసుకురాగా వాటిని కూల్చివేసి అక్కడ గదులు ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేశారు.
అందుకనుగుణంగా కార్యాలయంలో ఉన్న మరుగుదొడ్లతో పాటు మూత్రశాల లను సైతం కూల్చి వేశారు. దీంతో వైస్ చైర్మన్ అనారోగ్యం పాలుకావడంతో కూల్చిన వాటిని వది లేశారు. ఇప్పటికి గదులను కూల్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇంత వరకు వాటిని పూర్తి చేయలేకపోయారు. దీంతో భవన మరమ్మతులను ఎక్కడికక్కడే వదిలేశారు. ఫలితంగా కార్యాలయ సిబ్బంది, సందర్శకులు కనీస వసతులు లేకపోవడంతో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కనీసం తాత్కాలిక ఏర్పాట్లయినా చేయలేకపోయారు. ఫలితంగా కార్యాలయ సిబ్బంది ఐదు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇందుకోసం కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బస్టాండ్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా పనులు పూర్తిచేయలేకపోయారు. మొదటి పాలకవర్గ సమావేశంలో కార్యాలయంలోని గదుల మార్పులకు ఆమోదించారు. కార్యాలయంలో ఉన్న గదులను, మూత్రశాలలను కూల్చివేశారు. వాటి స్థానంలో గోడలు నిర్మించినప్పటికీ అసంపూర్తిగానే వదిలేశారు.
వారంరోజుల్లో పూర్తిచేస్తాం..
అనివార్య కారణాల వల్ల మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని వాటిని వారం రోజు ల్లో పూర్తిచేస్తాం. కార్యాలయానికి వాస్తు దోషం ఉండటం వల్లనే అంద రి సూచనల మేరకు కూల్చివేయడం జరిగింది. మరమ్మతులు అసంపూర్తిగా ఉన్నాయి.. వాటిని త్వరలో పూర్తిచేస్తాం.
- మున్సిపల్ చైర్మన్, బొంగుల విజయలక్ష్మి
‘మున్సిపల్’కు వాస్తుదోషమా!
Published Fri, Aug 28 2015 12:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
తప్పక చదవండి
- ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement