వివాహేతర సంబంధంతోనే హత్య | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతోనే హత్య

Published Thu, Mar 17 2016 1:44 AM

వివాహేతర సంబంధంతోనే హత్య - Sakshi

ఆరుగురు నిందితుల అరెస్ట్
40 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు

 
మిడ్జిల్ : వివాహేతర సంబంధంతోనే ఓ యువకుడు హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రియురాలి భర్త, ఐ దుగురికి సుపారి ఇచ్చి ప్రియుడిని చం పించగా ఎట్టకేలకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో షా ద్‌నగర్ ఏఎస్పీ కళ్మేశ్వర్ సింగేనవర్ వెల్లడించారు. ఖిల్లాఘన పురం మండలంలో ని మనాజీపేటకు చెందిన వెంకటేష్ (25) కొన్నాళ్లుగా మిడ్జిల్ మండలం బై రంపల్లిలోని అమ్మమ్మ దగ్గర ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన చాకలి శ్రీశైలం భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

విషయం తెలుసుకున్న భర్త పలుసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఎలాగైనా అతడిని తుదముట్టించాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా జడ్చర్లకు చెందిన బోయ మల్లేష్, పాలకొండ కృష్ణ, సురమోని నరేందర్, కాకి యాదగిరి, పద్నోల్ల శ్రీకాంత్‌లకు సుపారిగా రూ.లక్ష ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో గత నెల 7వ తేదీ ఉదయం జడ్చర్లకు వెళ్లిన వెంకటే ష్‌ను వారు కలిసి బియ్యం సంచులు ఉన్నాయని చెప్పి కిరాయికి ఆటో మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి మార్కెట్ తీసుకెళ్లి మధ్యాహ్నం ఆలూర్ వైపు బలవంతంగా లాకెళ్లి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు.

అదే అర్ధరాత్రి చిల్వేర్ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు మృతదేహాన్ని తెచ్చి పెట్రోలు పోసి తగులబెట్టారు. మరుసటిరోజు అటువైపు వెళ్లిన బాటసారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కాగా పాలకొండ కృష్ణపై గతంలోనే నాలుగు కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన కల్వకుర్తి సీఐ వెంకట్, మిడ్జిల్ ఎస్‌ఐ చంద్రమౌళీగౌడ్‌ను ఏఎస్పీ అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement