జాతరకు నాలుగు వేల బస్సులు | Sakshi
Sakshi News home page

జాతరకు నాలుగు వేల బస్సులు

Published Sat, Feb 13 2016 1:29 AM

Four thousand buses to the fair

జాతరలో ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి
అవసరమైతే మరిన్ని బస్సుల ఏర్పాటు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
మేడారంలో బస్టాండ్ ప్రారంభం

 
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మహా జాతరను పురస్కరించుకుని ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్టాండ్, క్యూ రెరుులింగ్స్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో కొద్దిదూరం ప్రయూణించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
జాతరకు విస్తృత ఏర్పాట్లు..
మేడారంలో బస్సులు నిలిపేందుకు సుమారు 50 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశామని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నందున ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. జాతర సమయంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతోపాటు బస్టాండ్ లో మరుగుదొడ్లు, విద్యుత్, ఎల్‌ఈడీ స్క్రీన్లు, కళాకారులతో సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రన్నింగ్ కండీషన్‌లో ఉన్న బస్సులనే జాతరకు ఎంపిక చేశామ ని, 12వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించామని వివరించారు. ఇందులో 7,300 మంది డ్రైవర్లు, 2,500 మంది కండక్టర్లతో పాటు రెండు వేల మంది టెక్నికల్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ జాతరకు 20 లక్షల మంది భక్తులను మేడారానికి తరలిస్తామనే అంచనా ఉందన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా మరమ్మతుకు గురైతే సరిచేసేందుకు పలు ప్రాంతాల్లో మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఈసారి కొత్తగా హైదరాబాద్ నుంచి జాతరకు ఏసీ బస్సులు నడుపుతున్నామన్నారు.
 
14 నుంచి ప్రత్యేక బస్సులు
ప్రైవేట్ వాహనాల్లో రావడం కంటే ఆర్టీసీ బస్సుల్లో మేడారం వస్తే గద్దెల సమీపానికి చేరుకునే అవకాశముంటుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని, ఈ బస్సులు 21వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.

వనదేవతలకు మొక్కులు
మేడారంలో బస్టాండ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నా రు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబుతో పాటు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన వనదేవతలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఆర్‌ఎం యాదగిరి, డీఎం మల్లేశం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నష్టాల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి
జనగామ : తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత  మొదటిసారిగా 500 బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రె డ్డి తెలిపారు. మేడారం పర్యటనను పురస్కరించుకుని జనగామలో శుక్రవారం ఆయన కాసేపు ఆగారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడవని 13 గ్రామాలకు పునరుద్ధరిస్తామన్నారు. 2004లో మరమ్మతుకు వచ్చిన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులను సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. నష్టా ల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తెలంగాణలోని 95 డిపోల్లో తాగునీటి సౌకర్యంతోపాటు మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement
Advertisement