ముందుకు సాగని ‘మిషన్ కాకతీయ’ | Sakshi
Sakshi News home page

ముందుకు సాగని ‘మిషన్ కాకతీయ’

Published Fri, Jan 23 2015 3:03 AM

ముందుకు సాగని ‘మిషన్ కాకతీయ’

* 89 చెరువులకు రూ.24.19 కోట్లు విడుదల
* ‘పునరుద్ధరణ’కు మూడుసార్లు నోటిఫికేషన్
* అయినా ముందుకు రాని కాంట్రాక్టర్లు
* వెంటాడుతున్న పర్సెంటేజీల భయం
* ఆయా పనులపై ప్రజాప్రతినిధుల కన్ను

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘మిషన్ కాకతీయ’కు బాలారిష్టాలు తప్పడం లేదు. మంత్రి మాటలు, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ పనులపై కొందరు ప్రజాప్రతినిధులు కన్నేయడంతో, కాంట్రాక్టర్లను ‘పర్సెంటేజీ’లు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధులు విడుదలైనాటెండర్లు జరగడం లేదు. ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలలో మొదటి విడతగా చేపట్టే 701 పనుల అంచనాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

356 చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను స్వీకరించిన ప్రభుత్వం 89 చెరువుల పనులను తక్షణమే మొదలు పెట్టాలని రూ.24.19 కోట్లు విడుదల చేసింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ల పరిధిలోని ఈ పనులను చేపట్టేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ఇప్పటికీ మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ-టెండర్ల ద్వారా పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

చెరువు పనులు లాభదాయకంగా ఉన్నా ఎందుకు ముందుకు రావడం లేదని ఆరా తీస్తే, అధికారులు సైతం పెదవి విప్పడం లేదు. కొం   దరు ప్రజాప్రతినిధులు పనులు మొదలెట్టే ముందు ‘మమ్మ ల్ని కలవాల్సిందే’ అంటూ ఆర్డర్లు వేయడంతోనే చెరువుల పనులపై మొగ్గు చూపడం లేదంటూ కాంట్రాక్టర్లు చర్చించుకుంటుండటం ఆసక్తికరంగా మారింది.  
 
ఇదీ పరిస్థితి
మొదటి విడతగా 701 చెరువుల పనులను ఈ ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో సర్వే చేసి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కలిగేలా అంచనాలు తయారు చేయాలని డిసెంబర్ ఐదున మంత్రి హరీష్‌రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించారు. అంతకు ముందు నుంచే నీటి పారుదల శాఖ 456 చెరువులు, కుంటలను సర్వే చేసి 356 చెరువులు, కుంటలపై రూ.131.19 కోట్ల అంచనా వ్యయం (ఎస్టిమేట్ కాస్ట్)కు సం బంధించిన రికార్డులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రతి జిల్లాలో 20 శాతం చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను 2015 మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో వివిధ కారణాల చేత చెరువుల పనుల ఎస్టిమేట్లు ఆశించిన రీతిలో ముందుకు సాగకపోగా, 89 చెరువుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.24.19 కోట్ల పనుల ఖరారుకు కొం దరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లకు మోకాలడ్డుతుండటం తో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న చర్చ ఉంది.

రూ. 24.19 కోట్ల పనులకు కోసం మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ-టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదంటే, చెరువుల పునరుద్ధరణ పనులపై ప్రజాప్రతి నిధుల పాత్ర ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే నిధులు విడుదలైన చెరువుల పునరు ద్ధర ణ ఎలా పూర్తవుతుంది? 345 చెరువుల ఎస్టిమేట్లు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎస్టిమేట్లు సమర్పించి సిద్ధంగా ఉన్న మిగిలిన 256 చెరువులకు నిధులు ఎప్పుడిస్తారు? టెండర్లు ఎలా చేపడుతారు? మార్చిలోగా మొదటి విడత చెరువుల పునరుద్ధరణ ఎలా సాధ్యం? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement