ఇంధన సర్దుబాటు చార్జీలు | Sakshi
Sakshi News home page

ఇంధన సర్దుబాటు చార్జీలు

Published Mon, May 26 2014 12:38 AM

fuel adjustment charges collected from consumers

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్‌ఎస్‌ఏ) విద్యుత్ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. కొన్నేళ్ల కిందట వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీలు విద్యుత్ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చార్జీలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వాలు, విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పంథా కొనసాగిస్తున్నాయి. తాజాగా 2011 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి సర్దుబాటు చార్జీలను ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వసూలు చేస్తున్నారు.

 యూనిట్‌కు 95 పైసలు..
 గతంలో వినియోగించిన విద్యుత్‌కు సం బంధించి ఉత్పత్తి ఖర్చు, బిల్లుల రూ పంలో వసూలైన మొత్తానికి తేడాను విని యోగదారులపై సర్దుబాటు చార్జీల రూ పంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది. మూడేళ్ల కిందట వాడుకున్న కరెంట్‌కు సంబంధించి ఈ సంవత్సరంలో బిల్లులు వసూలు చేస్తుండడంపై వినియోగదారు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా వందల కోట్ల రూపాయలు జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు కంపెనీకి చెల్లించారు. కాగా ఈ ఏ ప్రిల్ నెల బిల్లులో 2011 అక్టోబర్‌కు సం బంధించిన సర్దుబాటు చార్జీలను విని యోగదారులపై రుద్దటం జరిగింది. ఈ మే నెలలో నవంబర్ 2011, జూన్‌లో డిసెంబర్ 2011 సంబంధించిన సర్‌చార్జీలను వేయనున్నారు. ఏప్రిల్ బిల్లులో వినియోగదారులపై రూ.4.28 కోట్లు అదనపు భారం మోపారు.

అప్పట్లో లో టెన్ష న్ కనెక్షన్‌లపై 42.981 మిలియన్ యూని ట్లు, హైటెన్షన్ కనెక్షన్‌లపై 46.286 మిలి యన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగిం ది. ప్రతి యూనిట్‌పై 94.87 పైసలు సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేయాలని ఎన్‌పీడీసీఎల్ అధికారుల నుంచి ఇ దివరకే ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మూడు నెలలకు సంబంధించి వినియోగదారులపై సుమారు రూ.12.50 కోట్లు భారం పడనున్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. కాగా వినియోగదారుల నుం చి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానుల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గతంలో ఎవరో అద్దెకు ఉండగా ప్రస్తుతం ఇతరుల రావడం, వారు బిల్లులో సర్దుబాటు చార్జీల విషయంలో కట్టేందుకు వెనుకంజ వేస్తుండడం ఇంటి యజమానులకు గుదిబండగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement