Sakshi News home page

సాగునీటి బడ్జెట్కు భారీ కోత!

Published Fri, Nov 25 2016 3:07 AM

సాగునీటి బడ్జెట్కు భారీ కోత!

25 వేల కోట్ల నుంచి 16,500 కోట్లకు కుదించిన ఆర్థికశాఖ
నోట్ల రద్దు ఎఫెక్ట్ కారణంగానే..! మరింత తగ్గే అవకాశం కూడా..
పాలమూరులోనే 7,860.89 కోట్ల నుంచి రూ.1,340 కోట్లకు తగ్గింపు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో అగ్ర తాంబూలం దక్కించుకున్న నీటి పారుదల శాఖకు కేటారుుంపుల్లో భారీ కోత పడింది. ఆర్థిక పరిస్థితి, ఇతర ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగానికి కేటారుుంచిన బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.25 వేల కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు కుదించింది. ఈ మేరకు బడ్జెట్ అంచనాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అరుుతే సాగునీటిశాఖకు కేటారుుంచిన బడ్జెట్‌లో ఇప్పటివరకు రూ.8 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన ఆర్థిక శాఖ... రానున్న నాలుగు నెలల్లో మరో రూ.8 వేల కోట్లు ఇవ్వగలదా అన్నది సందేహాస్పదం గానే ఉంది. నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై  ఉన్న నేపథ్యంలో నిధులివ్వడం కష్టమేనని ప్రభుత్వ వర్గాలే స్పష్టం చేస్తున్నారుు.

 ఏకంగా మూడో వంతు..
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమంటూ 2016-17 బడ్జెట్‌లో నీటి పారుదల శాఖకు ఏకమొత్తంగా రూ.25 వేల కోట్లు కేటారుుంచారు. ప్రాజెక్టుల పూర్తికి వీలుగా ప్రతి నెలా రూ.2,100 కోట్లు విడుదల చేస్తామనీ ప్రకటించారు. అరుుతే ఆ తర్వాత ప్రభుత్వ ప్రాథమ్యాలు మారడం, రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, విద్యుత్, బియ్యం సబ్సిడీలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులు, హరితహారం, కృష్ణా పుష్కరాల నేపథ్యంలో సాగునీటి శాఖకు సరైన రీతిలో బడ్జెట్ కేటారుుంపులు జరగలేదు. ఎనిమిది నెలల్లో రూ.16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. రూ.8 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు.

వచ్చే ఐదు నెలలకు సంబంధించి బడ్జెట్ అవసరాలపై ఇటీవల సమీక్షించిన ఆర్థిక శాఖ... ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకుని అంచనాలను సవరించింది. ఇందులో భాగంగా సాగునీటి శాఖ బడ్జెట్‌లో ఏకంగా రూ.8,500 కోట్లకు కోత పెట్టింది. ప్రధాన ప్రాజెక్టుల బడ్జెట్‌కు కోత వేసినా తక్షణ ఆయకట్టు నిచ్చే ప్రాజె క్టులకు కేటారుుంపులు పెంచడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిలా ్లలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోరుుల్‌సాగర్, భీమా ప్రాజెక్టులకు కేటారుుంపులు పెంచారు. నెట్టెం పాడుకు తొలుత రూ.125 కోట్లు కేటారుుంచగా.. రూ.202 కోట్లకు పెంచారు. కల్వకుర్తికి రూ.300 కోట్లకుగాను రూ.586 కోట్లు, కోరుుల్‌సాగర్‌కు రూ.59.72 కోట్లకుగాను రూ.111 కోట్లకు కేటారుుంపులు పెంచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement