ఎవరు ఎక్కడ ఎలా.. | Sakshi
Sakshi News home page

ఎవరు ఎక్కడ ఎలా..

Published Wed, Apr 15 2020 11:27 AM

GHMC police And Medical Staff New Guidelines in Hyderabad - Sakshi

కోవిడ్‌– 19 వైరస్‌ నియంత్రణ కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 139  కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటయ్యాయి. వీటి పరిధిలో ఎవరేం చేయాలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు కూడా వీటి గురించి సరిగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు ఎలా? ఎవరేం చేయాలి? తదితర అంశాలను స్పష్టంగా వివరిస్తూ మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్వర్వు జారీ చేసింది. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకే.. చైన్‌ను తెంపేందుకే ఈ జోన్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆమేరకు జోన్‌లోని వారు బయటకు రాకుండా ఉండటమే కాక.. వారికి అవసరమైనవన్నీ ప్రభుత్వమే ఇంటి ముందుకు చేర్చాలి. కంటైన్‌మెంట్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు  సవివరంగా ఉత్తర్వుల్లో పొందుపర్చారు. ఇవీ ఆ వివరాలు.. 

సర్వేలెన్స్‌ టీమ్స్‌
కంటైన్మెంట్‌ జోన్‌ను నిరంతరం పర్యవేక్షించే నోడల్‌ టీమ్‌ ఏర్పాటు
నోడల్‌ ఆఫీసర్‌గా డిప్యూటీ కమిషనర్, ఈఈ, ఏసీపీ, ఏఎంఓహెచ్‌ స్థాయివారు.. లేదా జోనల్‌ కమిషనర్, ఆయన ప్రతినిధి కాని వ్యవహరించవచ్చు.
∙ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోలీసు అధికారి.
వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆశా, ఏఎన్‌ఎం, ఏడబ్ల్యూటీ
జోన్‌ పరిధిలోని వారికి నిత్యావసరాలు అందజేసే బాధ్యత నోడల్‌ ఆఫీసర్‌దే.  
ఏఎంఓహెచ్‌చే నియమించే శానిటరీ ఆఫీసర్, ఎంటమాలజీ విభాగం నుంచి ఒక అధికారి, బిల్‌కలెక్టర్‌ టీమ్‌లో ఉండాలి.

సర్వేలెన్స్‌ టీమ్‌ ఏం చేయాలి?  
ఏరోజుకారోజు చెత్త తరలింపు. కంటైన్మెంట్‌ జోన్‌ ప్రాంతంలో, ఆస్పత్రుల్లో  సేకరించిన చెత్తను సాధారణ చెత్తలో కలపకుండా ప్రత్యేక ఏర్పాట్లు. వీటి చెత్తను నేరుగా మండించే చోటుకు తీసుకువెళ్లేందుకు పారిశుద్ధ్య విభాగం అడిషనల్‌ కమిషనర్‌ కార్యాచరణ రూపొందించి అమలుపర్చాలి. ఇండెక్స్‌ కేస్‌ ఇళ్లనుంచి బయోమెడికల్‌ వేస్ట్‌ను నిర్ణీత ప్రొటోకాల్‌ మేరకు నిర్వహించాలి. లేన్లు, బైలేన్లతో సహ కంటైన్‌మెంట్‌  జోన్‌ మొత్తంలో క్రిమిసంహారక రసాయనాలు రోజుకు రెండుసార్లు పిచికారీ చేయాలి.  
సోషల్‌ డిస్టెన్స్‌ అమలుతోపాటు ఫీవర్‌ సర్వేను నిర్వహించి కరోనా లక్షణాలు కనిపిస్తే సంబంధిత ఆస్పత్రికి తరలించాలి. కొత్త పాజిటివ్‌ కేసులు గుర్తిస్తే ప్రైమరీ కాంటాక్ట్‌ వివరాలను ప్రొటోకాల్‌ మేరకు రూపొందించాలి. కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి లో/ హై రిస్క్‌ వారిని క్వారంటైన్‌ / ఐసొలేషన్‌కు తరలించాలి.
జోన్‌లో తిరిగే టీమ్‌లకు పోలీసు అధికారులు అవసరమైన రక్షణ కల్పించాలి. అవాంఛనీయ సంఘటనలేవైనా జరిగితే ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలి.  
కంటైన్‌మెంట్‌ జోన్‌ గురించి అందరికీ బాగా కనిపించేలా జోన్‌ పేరు, సరిహద్దులు, నో ఎంట్రీ వివరాలు, నోడల్‌ ఆఫీసర్, కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ తదితర వివరాల బ్యానర్లు ఏర్పాటు చేయాలి.  

జీహెచ్‌ఎంసీసర్కిల్‌ స్థాయిలో.. 
ఏఎంఓహెచ్‌/ఎస్‌ఎఫ్‌ఏ/అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌/డీఈఈ/ఏఈ/వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌/వాల్యుయేషన్‌ ఆఫీసర్‌/ఆర్‌ఐ/బీసీ/సీఓ. వీరితోపాటు జలమండలి, వైద్య ఆరోగ్యశాఖ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ శాఖల ఉద్యోగులుండాలి.
జీహెచ్‌ఎంసీ జోనల్‌ స్థాయిలోని సర్వేలెన్స్‌ టీమ్‌లో జోనల్‌ కమిషనర్‌తోపాటు పోలీసు విభాగం నుంచి డీసీపీ, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ నియమించే అధికారి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ నుంచి ఎస్‌ఈ, జీహెచ్‌ఎంసీ జోనల్‌ స్థాయి అధికారుల్లో ఎస్‌ఈ/సీపీ/వెటర్నరీ ఏడీ/జీవవైవిధ్య విభాగం ఏడీ.  
కంటైన్‌మెంట్‌  జోన్‌లో పాటించాల్సిన నిబంధనలన్నింటి అమలు బాధ్యతల ఇన్‌చార్జిగా ఈ టీమ్‌ వ్యవహరిస్తుంది.  

కమిషనర్‌కు పూర్తి బాధ్యతలు..
ఇవన్నీ ఏర్పాటయ్యేలా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బాధ్యతవహించాలి. జీహెచ్‌ఎంసీ స్థాయిలో ఒక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేసి నోడల్‌ ఆఫీసర్‌గా సీనియర్‌ అధికారిని నియమించాలి. మూడు కమిషనరేట్ల సీపీలతో సమన్వయంతో పనిచేయాలి. కంటైన్మెంట్‌ల జోన్ల వివరాలను సీఎస్, డీజీపీలు, సీపీలతోపాటు ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖకు ఏరోజుకారోజు తెలియజేయాలి. 

ఈవీడీఎం డైరెక్టర్‌ బాధ్యతలు ..
ప్రతి 15 రోజులకోసారి సిటీ మొత్తం క్రిమిసంహారక మందుల స్ప్రే చేయాలి. కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి రోజుకు రెండు పర్యాయాలు స్ప్రే. జోన్‌కు రెండు జెట్టింగ్‌ మెషిన్లు కేటాయించి, స్పే చేసేందుకు పారిశుధ్య విధులు నిర్వహించే వారికి స్ప్రే చేయడంలో శిక్షణ. క్షేత్రస్థాయిలోని అవసరమైన రక్షణ ఉపకరణాలు ఉండేలా చర్యలు.పారిశుధ్యానికి అవసరమైన  ఉపకరణాలు, రసాయనాలకు లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలి. 

జోనల్‌ కమిషనర్‌ విధులు..
ప్రజాప్రతినిధులు, పోలీసులతో చర్చించి కంటైన్మెంట్‌ జో¯న్‌ను గుర్తించాలి. చర్చల్లో  భాగంగా రిస్క్‌ను అంచనా వేసి బఫర్‌జోన్‌ గుర్తించాలి. బారికేడింగ్‌ ఏర్పాట్లు, ప్రతి జోన్‌కు సర్వేలెన్స్‌ టీమ్‌ల ఏర్పాటు, జోన్‌లోని వారికి వివిధ సేవలందించేందుకు, జోన్‌లో క్రమశిక్షణ అమలుకు  ప్రతి 50 ఇళ్లకో టీమ్‌ ఏర్పాటుచేయాలి. 24గంటలు పనిచేసేలా జోనల్‌స్థాయిలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు. ప్రతిరోజూ మానిటరింగ్, జరిగిన పనుల నివేదిక స్వీకరణ. సీపీలతోపాటు జోనల్‌ స్థాయి పోలీసు అధికారులతో సమన్వయంతో పనిచేయాలి.

వీరు ఇలా.. పోలీసు విభాగం..
ఎంట్రీ కమ్‌ ఎగ్జిట్‌ కు అనువైన ప్రాంతాల గుర్తింపుతోపాటు లా అండ్‌ ఆర్డర్, బందోబస్తు, సీసీటీవీ సర్వెలెన్స్‌ వంటి బాధ్యతలతోపాటు కంటైన్మెంట్‌జోన్లలోని వారు విధులు సాఫీగా నిర్వహించేందుకు డీసీపీ/ఏసీపీ స్థాయి వారు పనిచేయాలి.

డిప్యూటీ కమిషనర్లు..
వివిధ సేవలందించే జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఆరోగ్య విభాగాల టీమ్‌లకు పరిధిని కేటాయించాలి. ప్రైమరీ కాంటాక్ట్‌ కేసుల జాబితా రూపొందించాలి. ల్యాబ్‌ పరీక్షలు, వైద్య పరీక్షలకు వైద్య యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలి. ఫీవర్‌ సర్వే, నిత్యావసరాలు తదితరాలను పర్యవేక్షించాలి. అనుమానితకేసుల్ని గుర్తించి అవసరమైన కేంద్రాలకు తరలించాలి. పాసివ్‌ సర్వే ఆధారంగానూ ఎక్కడైనా అనుమానితులుంటే పరిశీలించాలి. అత్యవసర వైద్య సేవలవసరమైతే మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలి. అంబులెన్స్‌ సదుపాయం కల్పించాలి. 

వైద్య ఆరోగ్య విభాగం సేవలు..
భవిష్యత్‌లో అవసరమైతే వినియోగించుకునేందుకు వీలుగా అన్ని విభాగాలు పాజిటివ్‌  కేసులు, ప్రైమరీ కాంటాక్టŠస్‌ వివరాలను దగ్గర  ఉంచుకోవాలి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో పాజిటివ్‌ కేసు, లేదా  ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తే తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ కంటోన్మెంట్‌ బోర్డు సీఈఓకు తెలియజేయాలి లేదా జీహెచ్‌ఎంసీయే వాటిని తామే నిర్వహించాలి. నిబంధనల మేరకు అన్నీ సవ్యంగా అమలయ్యేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్‌ కమిషనర్లు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి. కంటైన్మెంట్‌ జోన్ల వారీగా టీమ్‌లు ఏర్పాటు చేయాలి. సర్కిల్, జోనల్‌ స్థాయిల్లో సంబంధిత అధికారులు ఫోన్‌నంబర్ల వివరాలతో జాబితా సీఎస్, డీజీపీ, సీపీలతోపాటు సంబంధిత అధికారులకు అందజేయాలి. కంటైన్మెంట్‌ జోన్ల పరిస్థితి, తీసుకున్న చర్యలు తదితర వివరాలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోజువారీ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలి. ఈ ఉత్వర్లులు వెంటనే అమల్లోకి వస్తాయని జీఓలో పేర్కొన్నారు.  జీహెచ్‌ఎంసీ జోన్ల వారీగా మొత్తం కంటైన్‌మెంట్‌ జోన్లు, వాటిలోని ఇళ్లు, జనాభా వివరాలతో పాటు కంటైన్మెంట్‌ జోన్లలో పాజిటివ్‌ కేసుల వివరాలు కమిషనర్‌ పంపే నివేదికలో ఉంటాయి. వీటితోపాటు కంటైన్మెంట్‌ జోన్‌లో పారిశుద్ధ్యం, రసాయనాల స్ప్రే, నిత్యావసరాల సరఫరా ఏర్పాట్లు, ఫీవర్‌ సర్వే, మైక్‌ ద్వారా ప్రచారం జరిగిందీ లేనిదీ వెల్లడించడంతో పాటు ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా తెలపాల్సి ఉంటుంది. నిబంధనల్లో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే అమలు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement