కేసీఆర్‌పై గరం... గరం.. | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై గరం... గరం..

Published Sun, Jun 8 2014 1:47 AM

కేసీఆర్‌పై గరం... గరం.. - Sakshi

రుణ మాఫీపై మాట తప్పారంటూ అన్నదాతల ఆగ్రహావేశం 

పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు
 
రుణ మాఫీకి పరిమితులు విధిస్తూ బ్యాంకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై అన్నదాతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రైతులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల శనివారం కేసీఆర్ దిష్టిబొమ్మలను రైతులు దహనం చేశారు. ధర్నా నిర్వహించారు. రుణ మాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 
రఘునాధపాలెం, న్యూస్‌లైన్:  రుణ మాఫీ అమలుకు షరతులు విధించడానిన నిరసిస్తూ రఘునాధపాలెం మండలంలోని పాపటపల్లి గ్రామ సెంటర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నిటినీ బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగణ, టీడీపీ నాయకులు వెంకటనారాయణ, మల్లిఖార్జునరావు, రామచంద్రు, కొండయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
 
మణుగూరులో..
మణుగూరు రూరల్: మణుగూరులోని అంబేద్కర్ సెంటర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. రుణ హామీని బేషరతుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  సర్పంచ్ బచ్చల భారతి, పార్టీ నాయకులు పాయం నర్సింహారావు, ముత్యంబాబు, వల్లభనేని రమణ, కొమరం పాపారావు, బాబు జానీ, విజయలక్ష్మి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
గార్లలో...
గార్ల: లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్న డిమాండుతో సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో గార్లలోని ఎస్‌బీహెచ్ ఎదుట రైతులు గంటపాటు ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కోనేటి సుశీల, సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాసరావు, రైతులు కె.మహేశ్వరరావు, ఇమ్మడి గోవింద్, ఈశ్వర్‌లింగం, గిరిప్రసాద్, పోటు వీరభద్రం, ఆనంద్, లింగారెడ్డి, లక్ష్మి, కవిత, సుజాత, రమ, తదితరులు పాల్గొన్నారు.
 
బయ్యారంలో...
 బయ్యారం: రైతుల రుణ హామీ మాఫీ చేయాలని కోరుతూ తహశీల్దార్ భిక్షంకు  సీపీఎం నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మండా రాజన్న, నంబూరి మధు, మేర్గు వెంకన్న, బల్లెం ఆనందరావు, కత్తి సత్యం, ప్రసాదరావు పాల్గొన్నారు.
 
కామేపల్లిలో...
కామేపల్లి: లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం, తహశీల్దారుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాదావత్ శ్రీను, నాయకులు వింజం నాగభూషణం, ఉప్పతల వెంకన్న, గుండా వెంకటరెడ్డి, అంబటి శ్రీనివాసరెడ్డి, ఎల్.రాంసింగ్, మేడ నాగేశ్వరరావు, అనంతరాములు, మేదర లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
 
ఇల్లెందులో...
ఇల్లెందు: పంట రుణాలన్నిటినీ ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలన్న డిమాండుతో రైతు సంఘం (సీపీఎం అనుబంధం) ఆధ్వర్యంలో తహాశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. తహాశీల్దారుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దేవులపల్లి యాకయ్య, ఎస్‌ఎ.నబీ, ఆలేటి కిరణ్, సర్వయ్య, వెంకన్న, రాందాస్, లక్ష్మయ్య, పాపారావు, సూర్య, సాయిలు, నారాయణ, భిక్షం తదితరులు  పాల్గొన్నారు.
 
అశ్వాపురంలో...
అశ్వాపురం: అశ్వాపురంలోని ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను టీడీపీ, బీజేపీ నాయకులు శనివారం దహనం చేశారు. ముందుగా, తె లుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి స్టేట్ బ్యాంక్ మీదుగా గౌతమి నగర్ కాలనీ గేటు వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం, తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహశీల్దారుకు వినతిపత్రమిచ్చారు.
 
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు టి.లత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముస్కు శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, నాయకులు వాసిరెడ్డి రమేష్‌బాబు, తుళ్ళూరి ప్రకాశ్, ఆదినారాయణ, రామకృష్ణ, కె.సత్యం, సత్యనారాయణ, ఏనుగు కృష్ణారెడ్డి, షరీఫ్, కర్నాటి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement