‘అనంతలక్ష్మి’కి అనుమతులు | Sakshi
Sakshi News home page

‘అనంతలక్ష్మి’కి అనుమతులు

Published Tue, Aug 26 2014 2:14 AM

‘అనంతలక్ష్మి’కి అనుమతులు

పోచమ్మమైదాన్ : వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు 2014- 15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లభిం చాయి. ఈ మేరకు కేంద్ర ఆయూష్ కార్యదర్శి జాస్మిన్ జేమ్స్ నుంచి కళాశాలకు సోమవారం ఉత్తర్వుల కాపీ అందింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం)నిబంధనల ప్ర కారం అన్ని సదుపాయాలు ఉన్నందున అనుమతి ఇచ్చినట్లు జేమ్స్ లేఖలో పేర్కొన్నారు. గతంలో రెండేళ్ల కాలానికి ఆయుర్వేద వైద్య కళాశాలకు సీసీఐఎం అనుమతి నిరాకరించడంతో విద్యార్థులు నిరుత్సాహానికి లోనయ్యారు.
 
2013-14 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు మాత్రమే కండిషనల్ అనుమతి ఉంది. ఈ ఏడాది సైతం కండిషనల్ అనుమతిని ఇచ్చారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ జూలై 17వ తేదీన హియరింగ్ నిమిత్తం ఢిల్లీకి రావాల ని సమచారం అందించిన సీసీఐఎం అధికారులు వారి నుంచి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. వరంగల్‌కు 50 బీఏఎంఎస్ సీట్లు మంజూరు చేశారు.

త్వరలో ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ జరగనుంది.కళాశాలకు అనుమతి రావడంతో కళాశాలలో విద్యార్థులు, బోధన సిబ్బంది స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశాల కోసం అనుమతులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరి కీ కృతజ్ఞతలు తెలిపారు.
 
ఫలించిన డిప్యూటీ సీఎం కృషి
కళాశాలలో ప్రవేశాల అనుమతి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది.  సీసీఐఎం అనుమతి నిరాకరించిన విషయాన్ని జూలైలో సాక్షి  దినపత్రికలో ప్రచురించడంతో రాజయ్య స్పందించి జోక్యం చేసుకున్నా రు. వెంటనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చర్చిం చారు. ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఎట్టకేలకు కళాశాలకు అనుమతులు వచ్చాయి.

Advertisement
Advertisement