పరిహారం ఇస్తారా? చంపేస్తారా?

28 Aug, 2019 11:05 IST|Sakshi
నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట

పోలీసులు, గౌరవెల్లి  భూ నిర్వాసితుల మధ్య తోపులాట

అక్కన్నపేట మండలంలో ఘటన

సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్‌): గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు భూ నిర్వాసితులు గాయాలపాలయ్యారు. మంగళవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గూడాటిపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు అడ్డుకునేందుకు గూడాటిపల్లి భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శాంతిపజేయడానికి వచ్చిన పోలీసులతో నిర్వాసితులకు వాగ్వాదం జరిగింది.

దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం పలువురు భూ నిర్వాసితులు మాట్లాడుతూ తమ విలువైన భూములను ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్ప జెప్పితే పోలీసులతో కొట్టిస్తారా అని కన్నెర్ర చేశారు. పరిహారం చెల్లించాలని శాంతియుత వాతావరణంలో ఆం దోళన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. మా ఇళ్లకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామన్నారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణలో మరో 62 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా దిగ్విజయమైన 'దియా జలావొ'

‘హాష్‌ట్యాగ్‌లు’ సృష్టించి వైరల్‌

పాల్వంచలో కంపించిన భూమి!

కరోనా భయంతో ఊరు వదిలివెళ్లిన ప్రజలు!

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!