సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం | Sakshi
Sakshi News home page

సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

Published Sat, Apr 23 2016 2:15 AM

సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం - Sakshi

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
 
మక్తల్ : రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాచ్‌వార్ గ్రామంలో మిషన్ కాకతీయ కింద బపన్‌కుంట చెరువు పనులను నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడం ఖాయమని అన్నారు. 2017నాటికి రైతులకు భీమా ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని 115 చెరువులకు అనుమతులు లభించాయని అన్నారు.

వాటిలో 37 చెరువులు పూర్తయ్యాయని ఎమ్మెల్యేను నిరంజన్‌రెడ్డి అభినందించారు. అనంతరం కాచ్‌వార్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన పట్టుపురుగుల పెంపకం షెడ్డును నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గాలి వెంకట్‌రెడ్డి అనే రైతు పట్టు పురుగుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల రైతును వారు అభినందించారు. అంతకు ముందు నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో పార్టీ తాలూకా ఇన్‌చార్‌‌జ దేవరి మల్లప్ప, నాయకులు రాజుల ఆశిరెడ్డి, గోపాల్‌రెడ్డి, సురెందర్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రవికుమార్ యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు రవిశంకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement