మధురానుభూతికి లోనవుతున్నా: నరసింహన్‌ | Sakshi
Sakshi News home page

మధురానుభూతికి లోనవుతున్నా: నరసింహన్‌

Published Fri, Dec 15 2017 8:11 PM

Governor Narasimhan Speech in World Telugu Conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాష, బతుకు మధ్య అవినావభావ సంబంధం ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం రాత్రి ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... తెలుగు మహాసభలు భువనవిజయంలా సాగుతున్నాయని అన్నారు. గుండె నిండుగా తెలుగు పండుగ జరుగుతోందన్నారు. తెలుగు భాష కమ్మదనాన్ని భావితరాలకు తెలుగు మహాసభలు పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి తెలుగు మహాసభల్లో పాల్గొనడం మధురానుభూతి అని వ్యాఖ్యానించారు.

ఎందరో మహానుభావులు తెలుగు భాషను సుపన్నం చేశారని కొనియాడారు. అవధానం తెలుగువారికే సొంతం కావడం గర్వకారణమన్నారు. తెలుగు భాష అత్యంత పురాతమైనది, అజరామరమైనదని తెలిపారు. కాలాగుణంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భాష మారాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. తెలుగు మహాసభలను కోటి గొంతుల వీణగా ఆయన వర్ణించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement