సరోగసీపై నివేదిక కోసం కమిటీ | Sakshi
Sakshi News home page

సరోగసీపై నివేదిక కోసం కమిటీ

Published Thu, Jul 6 2017 3:22 AM

సరోగసీపై నివేదిక కోసం కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: సరోగసీ విధానంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ గోపాల్‌ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిం చనున్నారు. కమిటీలో సీసీఎంబీ మాజీ డైరెక్ట ర్‌ పుష్పా భార్గవ్, రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ ఎథికల్‌ కమిటీ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, రిటైర్డు గైనకాలజిస్టు బాలాంబ, సంతాన సాఫల్య నిపుణురాలు అనురాధ, పేట్లబురుజు ఆస్పత్రి వైద్యురాలు మాలతి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సరోగసీకి సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసి 30 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సరోగసీ జరుపు తున్న ఆçస్పత్రులలోని సౌకర్యాలపై నివేదిక ఇచ్చేందుకు గాను వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని కూడా ప్రభుత్వం నియమించింది. అలాగే క్లినికల్‌ ట్రయల్స్‌పై కూడా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు గాను మరో కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement