ప్రజల గుండెల్లో పదిలం | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో పదిలం

Published Sat, Jul 9 2016 1:07 AM

grand celebration to ysr birth anniversary

ఘనంగా వైఎస్సార్ జయంతి

భూపాలపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాడని వైఎస్సార్ సీపీ మండల నాయకుడు ఇటుకాల భాస్కర్ అన్నారు. వైఎస్ 67వ జన్మదిన వేడుకలను భూపాలపల్లి పట్టణంలోని అమృత వర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అనాథ చిన్నారులచే కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆశ్రమానికి ఫ్యాన్‌ను బహుకరించారు. అనంతరం బాస్కర్ మాట్లాడుతూ.. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు.  కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధీర్, నాగరాజు, బుర్ర శ్రీకాంత్, ఏనుగు ఆజాద్‌రెడ్డి, రాజేష్, కొమటిరెడ్డి రవీందర్, శ్రావణ్ పాల్గొన్నారు.

 
గణపురంలో..

గణపురం: మండల కేంద్రంలోని కర్కపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ అభిమానులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని కొండాపురంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నిరంజన్, ప్రశాంత్, శ్రీకాంత్, శివ కృష్ణకాంత్, విజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.

 
చిట్యాలలో..

చిట్యాల : దివంగత ముఖ్యమంత్రి, జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్సార్ జన్మదిన వేడుకలను శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు జన్నె రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, యూత్ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, మహిళా విభాగం అధ్యక్షురాలు భీంరెడ్డి స్వప్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కాగిత రాజ్‌కుమార్ హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్మిక విభాగం అధ్యక్షుడు నెమలపురి రఘు, జిల్లా కార్యదర్శి మంచె అశోక్, జిల్లా సాంస్కతిక విభాగం అధ్యక్షుడు బుల్లెట్ వెంకన్న, జిల్లా నాయకులు రజనీకాంత్, ఆజాద్‌రెడ్డి, రత్నాకర్, పుల్యాల గాంధీ, మండల నాయకులు జన్నె రమేష్, జన్నె అశోక్, జన్నె నందు తదితరులు పాల్గొన్నారు.

 
ప్రజల హృదయాలలో నిలిచిన మహానేత వైఎస్సార్..

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్ జన్మదిన వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్‌ను ప్రజలు, రైతులు దేవుడని కొలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు అప్పం కిషన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు భీంరెడ్డి స్వప్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కాగిత రాజ్‌కుమార్, జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 
శాయంపేటలో..

శాయంపేట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్  68వ జయంతి వేడుకలను మండలంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు మండలకేంద్రంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్  సీపీ నాయకుడు అల్లె అర్జున్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్యను అందించిన మహానీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మారపల్లి సుధాకర్, అరికిల్ల వీరయ్య, అరికిల్ల శివకష్ణ, మారపల్లి సుదర్శన్, మునిగే విజేందర్, తదితరులు పాల్గొన్నారు.

 
మొగుళ్లపల్లిలో..

మొగుళ్ళపల్లి: మండల వైఎస్సార్ సీపీ అధ్వర్యంలో డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మండల అధ్యక్షుడు పుల్యాల గాంధీ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలో రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ పథకం, ఇందిరమ్మ ఇల్లు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో నాయకులు రవివర్మ, లడె సమ్మారావు, మంద రమేష్, కల్లెపల్లి రమేష్, పి సామెల్, ప్రభాకర్, విజేందర్, అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement