ఘనంగా మహంకాళి బోనాలు | Sakshi
Sakshi News home page

ఘనంగా మహంకాళి బోనాలు

Published Mon, Jul 21 2014 4:07 AM

ఘనంగా మహంకాళి బోనాలు

కాజీపేటలో సందడే సందడి
* అమ్మవారికి మొక్కులు
* చెల్లించుకున్న భక్తులు
* ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు
 కాజీపేట: పట్టణ శివారు సోమిడిలోని మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢమాసం చివరి ఆదివారం ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని ద ర్శించుకున్నారు. ఆలయ పూజారి ముత్యాల సరస్వతి, రాజు, లక్ష్మణ్ అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. విష్ణుపురి సబర్మతి పాఠశాల, వెంకటాద్రినగర్, బాపూజీనగర్, ప్రశాంత్‌నగర్‌లో అమ్మవారికి మహిళలు మంగళహారతులతో ఎదురేగి మొక్కులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి సాంబయ్య, టీఎన్‌టీయూసీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అంకూస్ అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆకట్టుకున్న నృత్యాలు..
డప్పు వాయిద్యాల మోతలు, చిందు కళాకారులు, పోతరాజులు చేసిన నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. దేవతామూర్తుల వేషధారణలతో చిందు కళాకారులు ఊరేగింపు అగ్రభాగాన నిలిచి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరూరి సాంబయ్య, గౌని సాంబయ్యగౌడ్, రాంచరణ్‌తేజ్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్, బక్కతట్ల మోహన్, బుర్ర తిరుపతి, స్థానిక పెద్దలు ధర్మయ్య, శ్రీనివాస్, ఎండీ అలీసాహెబ్, యాదగిరి, గద్దె సతీష్ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement