‘కాళేశ్వరం’ టెండర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ టెండర్లకు గ్రీన్‌ సిగ్నల్‌

Published Sat, Apr 8 2017 9:03 PM

కాళేశ్వరం ప్రతిపాదిత స్థలంలో సీఎం పరిశీలన(ఫైల్‌) - Sakshi

హైదరాబాద్‌: గోదావరి నదీ జలాల్లో నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఐదు ప్రధాన రిజర్వాయర్ల నిర్మాణ పనులకు నీటిపారుదలశాఖ త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఇందుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు ఆ దిశగా సమాయత్తమవుతున్నారు. వారంలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు.

రూ.10,876 కోట్లతో చేపట్టే ఈ ఐదు రిజర్వాయర్లలో మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీలతో చేపట్టనుండగా దానికి రూ.7,249.52 కోట్లకు ఇప్పటికే ఆ శాఖ ఓకే చేసింది. అలాగే రంగనాయక సాగర్‌ రూ. 496.50 కోట్లు, కొండపోచమ్మ రూ.519.70 కోట్లు, గంధమల రూ.860.25 కోట్లు, బస్వాపూర్‌ రూ.1,751 కోట్లకు అనుమతులు వచ్చాయి. వీటికి గత నెల 8నే పరిపాలనా అనుమతులు వచ్చినా సాంకేతిక అనుమతులు రాలేదు.

దీనికితోడు కాళేశ్వరం పర్యావరణ, అటవీ అనుమతుల అంశంలో అధికారులు బిజీగా ఉండటంతో టెండర్ల అంశం మరుగునపడింది. అయితే శుక్రవారం సమీక్ష సందర్భంగా మల్లన్నసాగర్‌ వరకు వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసి నీటిని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement