'పూడికతీతతో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు'

30 Jun, 2014 13:09 IST|Sakshi
'పూడికతీతతో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు'

హైదరాబాద్:తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పురోగతిపై సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈ అంశానికి సంబంధించి తాగునీటి శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ భేటీలో గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కాగా, ఆక్రమణలకు గురైన చెరువులను కూడా తిరిగి పునరుద్దరణ కార్యాచరణను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. పూడికతీత పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని హరీష్ రావు అధికారులకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

 

శనివారం ' సాక్షి' తో మాట్లాడిన హరీష్ రావు.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేలాల్సి ఉందన్నారు. నదీ జలాల వాటాపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. ఆ తరువాతే ప్రాజెక్టులపై ఆలోచిస్తామన్నారు.

మరిన్ని వార్తలు