తేలాల్సింది మెజార్టీయే.. | Sakshi
Sakshi News home page

తేలాల్సింది మెజార్టీయే..

Published Tue, Nov 27 2018 9:23 AM

HarishRao Election Campaign In Warangal - Sakshi

సాక్షి, తొర్రూర: ‘నాకు ఏం డౌట్‌ లేదు.. పైసా మందం అనుమానం లేదు. తేలాల్సింది దయాకరన్నకు ఎంత మెజార్టీ వస్తుందనేదే.. ప్రత్యర్థికి డిపాజిట్‌ వస్తుందో రాదో తేలాల్సి ఉంది’ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని యతి రాజారావు పార్క్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన సోమవారం  నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హరీష్‌రావు మాట్లాడుతూ దయాకరన్న నిర్వహించిన భారీ రోడ్‌షోను చూస్తే 50 వేల మెజార్టీతో గెలిచి తీసిన విజయోత్సవ ర్యాలీలాగా కనిపిస్తుందన్నారు. మీరు ఏం పుణ్యం చేసుకున్నారోగానీ, దయాకర్‌రావు,సుధాకర్‌రావులాంటి మంచి నాయకులు మీ నియోజకవర్గంలో ఉన్నారన్నా రు. ఆంధ్రోళ్ల పార్టీ టీడీపీలో ఎందుకని, తానే టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చానని గుర్తు చేశారు.

దయాకర్‌రావుకు పెద్ద పదవి ఇస్తానంటే, తనకు పదవి వద్దు అని చెప్పి, తమ నియోజకవర్గానికి నీళ్లు, నిధులు ఇవ్వాలని కోరిన ఏకైక నాయకుడు దయాకర్‌రావు అని ప్రశంసించారు. సుధాకర్‌రావుకు త్వరలో మంచి పదవి ఇచ్చి పార్టీ గుర్తిస్తుందన్నారు. దయాకర్‌రావును 50 వేల మెజార్టీతో గెలిపిస్తే చిన్నవంగర, మాటేడు గ్రామాల్లో రిజర్వాయర్లు నిర్మించి సాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు. సొంత డబ్బులతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను కొనుగోలు చేసిన ఏకైక నేత దయాకర్‌రావు అన్నారు. దయాకర్‌రావు కృషితోనే తొర్రూరు రెవెన్యూ డివిజన్, మునిసిపాలిటీ  అయిందన్నారు. దొంగ, రౌడీషీటర్‌ను గెలి పించకుండ,ప్రజలు నిజాయితీతో పనిచేసే దయాకర్‌రావును గెలిపించాలన్నారు. కార్యక్రమంలో డోర్నకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌రావు, గిరిజన కార్పొరేష న్‌ చైర్మన్‌ గాంధీనాయక్, ఎంపీపీ కర్నె సోమయ్య, జెడ్పీటీసీ కమలాకర్, నాయకులు దామోదర్‌రెడ్డి, సీతారాములు, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement