మరో నాలుగు రోజులు వడగాడ్పులు | Sakshi
Sakshi News home page

మరో నాలుగు రోజులు వడగాడ్పులు

Published Sat, May 20 2017 4:09 AM

మరో నాలుగు రోజులు వడగాడ్పులు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక
నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
► రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీలపైనే నమోదు


సాక్షి నెట్‌వర్క్‌: వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావ రణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించింది. రోహిణీ కార్తె దగ్గర పడుతుండటంతో ఎండలు మండిపోతు న్నాయి. ఉదయం 9 గంటల నుంచే వేడి గాలు లు వీస్తున్నాయి. జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. శుక్రవారం నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యా ప్తంగా చాలాచోట్ల 40 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ గా 45 డిగ్రీలు, నల్లగొండలో సాధారణం కంటే 4.8 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో వడదెబ్బతో శుక్రవారం 20 మంది మృత్యువాత పడ్డారు. అందులో 14 మంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిధిలోని వారే.

రాలిపోతున్న పక్షులు
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో జంతువులు, పక్షులు కూడా విలవిల్లాడుతు న్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురంలో తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు క్వార్టర్స్‌ ఆవరణలో రావిచెట్లపై ఉన్న గబ్బిలాలు పదుల సంఖ్యలో చనిపోతున్నాయి.

అన్నమూ ఉడికిపోతోంది..
ఎండలు మండిపోతుండడంతో ఆ వేడికి అన్న మూ ఉడికిపోతోంది. జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన పెను మల్ల కృష్ణారెడ్డి, అంబిక దంపతులు చిన్న గిన్నెలో బియ్యాన్ని నానబెట్టి ఉదయం ఎండలో పెట్టారు. సాయంత్రానికల్లా ఆ బియ్యం ఉడికిపోయి అన్నంగా తయారైంది.

శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌ల్లో)

ప్రాంతం          ఉష్ణోగ్రత
నల్లగొండ        46
రామగుండం    45.8
భద్రాచలం       45.4
ఖమ్మం          45.2
నిజామాబాద్‌    44.9
ఆదిలాబాద్‌     44.8
హన్మకొండ    44.5
మెదక్‌           43.7
హైదరాబాద్‌    42.5
హకీంపేట       40.7

Advertisement
Advertisement