ఇరాక్ బాధితుల కోసం హెల్ప్‌లైన్ | Sakshi
Sakshi News home page

ఇరాక్ బాధితుల కోసం హెల్ప్‌లైన్

Published Wed, Jun 18 2014 2:04 AM

helpline fecility for Iraq victims

బాధితుల వివరాలు సేకరించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
 సాక్షి, హైదరాబాద్: అంతర్యుద్ధం కారణంగా ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణ వారికి తగిన సాయం అందించేందుకు, అవసరమైతే వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు, ఇతరులు ఎవరైనా ఇరాక్‌లో చిక్కుకుపోయారేమో తెలుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.

 

బాధితులకు సంబంధించి పాస్‌పోర్టు నంబర్, వారు ఇరాక్‌లో ఎక్కడ ఉండేదీ, పనిచేసే కంపెనీ తదితర వివరాలను వారి కుటుంబ సభ్యుల నుంచి సేకరించాలని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం భారత విదేశీ వ్యవహారాల శాఖతో, బాగ్దాద్‌లోని భారతీయ అధికారులతో సంప్రదిస్తోందని, ఇప్పటికే బాగ్దాద్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ప్రొటోకాల్) ఎన్.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు సాయం అందించేందుకు తెలంగాణ సచివాలయంలోని ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో హెల్ప్‌ైలైన్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
 
సచివాలయంలోని హెల్ప్‌లైన్ వివరాలివీ:
 ఈ.చిట్టిబాబు, సెక్షన్ అధికారి, ఫోన్ నంబర్ : 040-23220603, మొబైల్  నం. 94408 54433.
 ఇరాక్‌లోని హెల్ప్‌లైన్ నం: 00964 770 444 4899, 00964 770 444 4899, 00964 770 484 3247, 00964 770 484 3247

Advertisement
Advertisement