కోర్టులు రాజకీయ వేదికలా? | Sakshi
Sakshi News home page

కోర్టులు రాజకీయ వేదికలా?

Published Wed, Sep 13 2017 2:38 AM

కోర్టులు రాజకీయ వేదికలా? - Sakshi

► ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీరుపై హైకోర్టు మండిపాటు
► పలువురికి కేబినెట్‌ హోదాపై పిల్‌ ఉపసంహరణకు నిరాకరణ


సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పం దించింది. కాంగ్రెస్‌ నుంచి అధికార టీఆర్‌ఎస్‌ లోకి వెళ్లకముందు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేం దుకు అనుమతి కోరడంపై ఆగ్రహించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఎలా ఉపసంహ రించుకుంటారని ప్రశ్నించింది.ఇందుకు తాము ఎంత మాత్రం అంగీకరించబోమని చెప్పింది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేసింది.

కోర్టులను రాజకీయ వేదికలు గా మార్చుకోవడానికి వీల్లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నచ్చనప్పుడు కోర్టులో వ్యాజ్యాలు వేసి, నచ్చినప్పుడు ఉపసంహరిం చుకుంటామంటే కుదరదని పేర్కొంది. ఈ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించకున్నా ఫర్వాలే దని, తాము విచారణను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. కావాలంటే పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను మాత్రం ఉపసం హరించుకోవచ్చునంది. పలువురికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను ఉపసంహరించు కునేందుకు అంగీకరించబోమంది.

తదుపరి విచారణను కొనసాగిస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పుడు వివిధ హోదాల్లో ఉన్న పలువురికి కేబినెట్‌ హోదానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ ఆయన 2015లో పిల్‌ దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం పలువురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యద ర్శులుగా నియమిస్తూ జీవో జారీ చేసింది.

దీన్ని కూడా గుత్తా సవాలు చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. ఆ తర్వాత గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో తాను 2015లో దాఖలు చేసిన పిల్, రిట్‌ పిటిషన్‌ను ఉపసం హరించుకునేందుకు అనుమతిని కోరుతూ దరఖాస్తును కోర్టు ముందుంచారు. రెండు వ్యాజ్యాలు మంగళవారం ధర్మాసనం ముందు కు వచ్చాయి. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పిల్‌ ఉపసంహరణకు అనుమతిని నిరాకరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement