రీ పోస్టుమార్టం చేయండి | Sakshi
Sakshi News home page

రీ పోస్టుమార్టం చేయండి

Published Fri, Apr 7 2017 2:17 AM

రీ పోస్టుమార్టం చేయండి - Sakshi

మధుకర్‌ కేసులో పోలీసులకు ఉమ్మడి హైకోర్టు ఆదేశం
మధుకర్‌ది హత్యేనంటూ హైకోర్టులో అతడి తల్లి పిటిషన్‌


సాక్షి, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన మధుకర్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేప థ్యంలో అతడి మృతదేహానికి మరోసారి శవ పరీక్ష (రీపోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణుల నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది. కరీంనగర్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ సమ క్షంలో ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలంది.

రీ పోస్టుమార్టం వేళ మధుకర్‌ కుటుంబ సభ్యులను అనుమతించడంతోపాటు మొత్తం ప్రక్రియను వీడియో తీయా లని పోలీసులకు స్పష్టం చేసింది. అనంతరం దీనిపై ఓ నివే దికను సీల్డ్‌ కవర్‌లో తమ ముం దుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను వచ్చే వారానికి వాయిదా వేసింది. గురు వారం ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.రామలిం గేశ్వరరావు ఉత్తర్వు లు జారీ చేశారు.

ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ
తన కుమారుడి మృతి కేసును హత్య కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మధుకర్‌ తల్లి లక్ష్మి హైకోర్టులో గురువారం లంచ్‌ మోషన్‌ రూపంలో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ వాదనలు వినిపించారు. మార్చి 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్‌ 14వ తేదీన శవమై కనిపించాడని, దీన్ని పోలీసులు అనుమానస్పద మృతిగా పరిగణించారని, ఇది సరికాదని ముమ్మాటీకి హత్యేనని వివ రించారు.

 అగ్ర కులానికి చెందిన అమ్మా యిని ప్రేమించినందుకు సదరు యువతి బంధువులు మధుకర్‌ను హత్య చేశారని తెలి పారు.  మధుకర్‌ మృతికి కారణమైన వారిపై పిటిషనర్‌ అనుమానం వ్యక్తం చేసినా పోలీ సులు కనీసం ప్రశ్నించలేదని, ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తుపై తమకు అనుమానాలు న్నాయన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావా లంటే మృతదేహానికి ఫోరెన్సిక్‌ నిపుణుల చేత రీపోస్టుమార్టం చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో ఫోరెన్సిక్‌ నిపుణులున్నారని వివరించారు.

రీ పోస్టుమార్టంపై ఇప్పటికే నిర్ణయం..
ప్రభుత్వ న్యాయవాది (హోం) హెచ్‌.వేణు గోపాల్‌ స్పందిస్తూ, రీ పోస్టుమార్టంపై ఇప్ప టికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాకతీయ వైద్య కళాశాల వైద్యులు రీ పోస్టు మార్టం చేయనున్నారని కోర్టుకు నివేదిం చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉస్మా నియా, కాకతీయ వైద్య కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో మధుకర్‌ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిం చాలని పోలీసులను ఆదేశించారు. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని, మధుకర్‌ కుటుంబ సభ్యులను అనుమతించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Advertisement
Advertisement