పరిమితికి మించి ఖర్చు చేస్తున్న పార్టీలపై ఏం చర్యలు తీసుకున్నారు? | Sakshi
Sakshi News home page

పరిమితికి మించి ఖర్చు చేస్తున్న పార్టీలపై ఏం చర్యలు తీసుకున్నారు?

Published Tue, Dec 9 2014 2:39 AM

High court orders to take actions on spending more money for parties

పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో నిర్దేశించిన దాని కంటే అధిక మొత్తాలు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో, ఇకపై ఏం చర్యలు తీసుకుంటారో వివరించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని, అసలు దేశంలో ఎన్ని గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన పార్టీలు ఉన్నాయో కూడా తెలియజేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
 
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాయని, ఈ విషయంలో కొత్త నిబంధనలను రూపొందించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కింగ్‌షుక్ నాగ్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారించింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement