సంతోష్‌రెడ్డి డిప్యుటేషన్‌ పొడిగింపునకు హైకోర్టు నో | Sakshi
Sakshi News home page

సంతోష్‌రెడ్డి డిప్యుటేషన్‌ పొడిగింపునకు హైకోర్టు నో

Published Fri, Jun 16 2017 1:06 AM

High Court Rejected To Santoshi Reddy Deputation

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌ రెడ్డి డిప్యుటేషన్‌ను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ఉమ్మడి హైకోర్టు తిరస్కరించింది. న్యాయశాఖ కార్యదర్శి మూడేళ్లు మాత్రమే డిప్యుటేషన్‌పై పనిచేయాల్సి ఉందని, అంతకుమించి కొనసాగితే నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనల ఉల్లంఘనకు అంగీకరించేది లేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తిరిగి న్యాయాధికారిగా విధుల్లో చేరాలని సంతోష్‌రెడ్డిని ఆదేశించింది.

 గురువారంతో డిప్యుటేషన్‌ పూర్తయిన నేపథ్యంలో హైకోర్టు ఆయనకు మియాపూర్‌ 15వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా పోస్టింగ్‌ ఇచ్చింది. డిప్యుటేషన్‌ గడువు ముగిసిన వెంటనే విధుల్లో చేరాలని తేల్చి చెప్పింది. 2014 జూన్‌ 2న సంతోష్‌రెడ్డి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘సుజల స్రవంతి కమిటీ’లో రామాంజనేయులు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రాణహిత సుజల స్రవంతికి సంబంధించిన అంశాలపై అధ్యయన కమిటీలో న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి బి.రామాంజనేయులకు స్థానం కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement