పేదలకు రాయితీ విద్యుత్‌! | Sakshi
Sakshi News home page

పేదలకు రాయితీ విద్యుత్‌!

Published Wed, Jul 26 2017 1:25 AM

పేదలకు రాయితీ విద్యుత్‌! - Sakshi

► సమర్థంగా ఉత్పత్తి చేస్తే సాధ్యమే: సీఎం కేసీఆర్‌
విద్యుత్‌ ప్రాజెక్టులపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష


సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను మిగులు విద్యుత్‌గల రాష్ట్రంగా మార్చేందుకు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు. సమర్థంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుందని... పేదలు, రైతులకు రాయితీలు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బీహె చ్‌ఈఎల్‌ ఈ ప్రక్రియలో మరింత వేగం సాధించాలని కోరారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ మంగళవారం అక్కడే వివిధ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్నతస్థాయిలో సమీక్షిం చారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు త్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలా చారి, బీహెచ్‌ఈఎల్‌ చైర్మన్‌ అతుల్‌ సోక్తి, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో ఈడీ అజయ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటును డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. మణుగూరులో 1,080 మెగావాట్ల బీటీపీఎస్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

దామరచర్లలో నిర్మించతలపెట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగూడెంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంటు స్థాపనకు సిద్ధం కావాలన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించలేదని సీఎం గుర్తు చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి అంతా ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే జరగాలన్న నియమం పెట్టుకుని త్రికరణ శుద్ధితో అమలు చేస్తు న్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ ఈఎల్, జెన్‌కో ప్రభుత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement