పెరిగిన జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లు! | Sakshi
Sakshi News home page

పెరిగిన జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లు!

Published Fri, Feb 24 2017 2:39 AM

పెరిగిన జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లు! - Sakshi

గతేడాది 404, ఈ విద్యా సంవత్సరం 460
పాఠశాలల్లో తగ్గిన 2.87 లక్షల మంది విద్యార్థులు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలల (జీరో ఎన్‌రోల్‌ మెంట్‌ స్కూల్స్‌) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవ త్సరంలో వాటి సంఖ్య మరింత పెరిగింది. 2015–16 విద్యా సంవత్సరంలో 404 ఉన్న జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలల సంఖ్య, 2016–17 విద్యా సంవత్సరంలో 460కి పెరిగింది. 2015–16లో జీరో ఎన్‌రోల్‌ మెంట్‌ ఉన్న 404 స్కూళ్లల్లో.. 273 పాఠ శాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రారంభించినా, 2016–17లో మళ్లీ 460 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం గమనార్హం.

ఈ విద్యా సంవ త్సరానికి సంబంధించి జిల్లా విద్యా సమాచార వివరాల (డైస్‌ డాటా) సేకరణను విద్యా శాఖ పూర్తి చేసింది. గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2.87 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అందులో ప్రభు త్వ పాఠశాలల్లో 1,24,567 మంది, ప్రైవే టులో 75,163 మంది, ఎయిడెడ్‌లో 17,654 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు విద్యా శాఖ లెక్కలు వేసింది. గతంలో విద్యార్థి వారీగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనప్పటికీ, ఈసారి ప్రతి విద్యార్థి వివరా లను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు చెక్‌ పడింది. మరోవైపు గురుకులాల ఏర్పాటుతో వాటిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది.

Advertisement
Advertisement