ఇక్కడే అమ్మాడటా! | Sakshi
Sakshi News home page

ఇక్కడే అమ్మాడటా!

Published Fri, Dec 26 2014 1:28 AM

His wife, a teacher, a constable

పెద్దపల్లి : ఓ కానిస్టేబుల్ ఆయన భార్య టీచర్.. జ్యూవెల్లర్ దుకాణానికి వెళ్లి బంగారం విక్రయించారు. వచ్చిన డబ్బులు కుటుంబ అవసరాలకు వాడుకున్నాడు. ఆ కానిస్టేబులే దొంగ అవతారం ఎత్తాడని పోలీసు అధికారులకు తెలిసింది. కానీ.. చివరికి అది దొంగ బంగారంగా తేలడంతో షాపు యజమాని నుంచి బంగారం రికవరీ చేశారే తప్ప సదరు కానిస్టేబుల్ నుంచి డబ్బులిప్పించలేదు. మంచిర్యాలకు చెందిన ఓ యువకుని వద్ద గోదావరిఖని వ్యాపారి రెండు తులాల బంగారం కొనుగోలు చేశాడు. దొంగ బంగారంగా తేలడంతో మంచిర్యాల పోలీసులు బంగారం రికవరీ చేసుకున్నారు.
 
 ఇదే కేసులో బెల్లంపల్లి పోలీసులు సైతం అదే దుకాణానికి వెళ్లి బంగారం రికవరీ చేసుకెళ్లారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దొంగ చెప్పాడు, మీరూ అడగండి ‘ఇక్కడే అమ్మాడంట’ అదే విషయం చెబుతాడు. దొంగ చెప్పిన సాక్ష్యానికి పోలీసులు తీర్పునిస్తూ స్వర్ణకారులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు జిల్లాలో ఏదో ఒకమూలకు.. ఒక షాపులో జరుగుతున్నవే. దొంగతనం జరిగిన కొద్దిరోజులకు పోలీసులు ఓ ఇద్దరు యువ కులను పట్టుకొని షాపులవెంట తిరగడం సర్వసాధారణమైపోయింది. జిల్లాలో దాదాపు 30 వేల స్వర్ణకార కుటుంబాలు ఉండగా, 20 వేల కుటుంబాలు ఇదే వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నాయి.  
 
 పోలీసుల దెబ్బలకు వృత్తి మారింది..
 తెలంగాణప్రాంతంలో చేస్తున్న పనినిబట్టి కులాన్ని దాదాపు అంచనా వేయొచ్చు. అందులో స్వర్ణకారవృత్తి చేస్తున్నవారిలో 95 శాతం మంది అదే కులస్తులు ఉంటుంటారు. ఇక్కడ కట్టెలు కొడుతూ కనిపిస్తున్న యువకుని పేరు కట్టా నర్సింహచారి. ఆయన తండ్రి బ్రహ్మయ్యచారిని 20 ఏళ్లక్రితం మంచిర్యాల పోలీసులు దొంగబంగారం కొనుగోలు చేశాడనే నెపంతో పట్టుకెళ్లి హింసించారు. అప్పుడే ఆయన తన పనిమాని వడ్రంగి వృత్తిని చేపట్టాడు. తనకొడుకులు ఇదే కులవృత్తిలో ఉంటే పోలీసుల నుంచి బాధలు తప్పవనే భయంతో కులవృత్తిని సైతం నేర్పించలేదు. దీంతో బ్ర హ్మయ్య పెద్దకొడుకు ఇక్క డే ప ట్టణంలో క ట్టెల వ్యా పారంచేసుకుంటున్నా డు.తనకుతాను స్వర్ణకారుడు అని చెప్పుకునేవారకు నర్సింహచారి కులం ఎవరికి అర్థంకాదు. దానివెనుక ఉన్న తన తండ్రి కథను చెబుతుంటాడు. నర్సింహచారిలాగే వృత్తి మారిన స్వర్ణకారులు జిల్లాలో చాలామంది ఉన్నారు.
 
 దొంగ దొరికితే.. సీసీఎస్
 పోలీసులకు బంగారమే
 దొంగలు పట్టుబడితే వస్తువుకోల్పోయిన యజమానులకంటే పోలీసులకే పంట పండుతుంది. దొరికిన దొంగలను వెంట వేసుకొని సదరు చోరీ సంఘటనకు పాల్పడిన వారి ఇళ్లను గాలించి, సొమ్మును నగదును రికవరీ చేసుకున్న తర్వాత ఇక స్వర్ణకారుల జ్యూవెల్లర్ షాపులపై పడతారు. ముందే దొంగకు బంగారం విక్రయించిన పద్ధతిని, తాము అడిగితే జవాబు ఇచ్చే విధానం నే ర్పుతారు.
 
 అలా పోలీసుల  ఆధీనంలో ఉన్న నిందితులు పోలీసులు నేర్పిన పద్ధతుల్లోనే జవాబు ఇస్తారు. అవును.. నీకే బంగారం అమ్మేశాను కదా, నీవు డబ్బులు కూడా ఇచ్చావ్. అవి జల్సాల కోసం ఖర్చు చేసుకున్నా అంతే. ఇంతకంటే ఎక్కువనాకు తెలియదు. ఇదీ పోలీస్‌స్టేషన్‌లో దొంగలు చెప్పే జవాబులు. లాండ్‌ఆర్డర్ పోలీసులకంటే సీసీఎస్ పోలీసులు ఇంకాస్త భిన్నంగా వ్యవహరిస్తారు. ఒక్కో దొంగతనం కేసులో నాలుగైదుచోట్ల రికవరీ చేసిన సందర్భాలూ ఉన్నాయని పలువురు స్వర్ణకారులు తెలిపారు. అయితే ఇదే మిటని ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో సీసీఎస్ పోలీసులకు ఎదురే ఉండదు.
 
 లాండ్‌ఆర్డర్ పోలీసులు స్థానిక పరిస్థితులను దష్టిలో ఉంచుకొని స్వర్ణకారులతో మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. దొంగలను విచారించే సమయంలో కూడా స్థానికంగాఉండే స్వర్ణకారులతో ఉండే సంబంధాలను దష్టిలో ఉంచుకొని రికవరీలో కాస్త మెతక వైఖరిని చూపుతుంటారు. కానీ సీసీఎస్ పోలీసులు మాత్రం దొంగ దొరికాడంటే ఇక తమ పంట పండింది అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. దొంగ ఇచ్చిన సమాచారంతో జ్యూవెల్లర్ దుకాణయజమానికి అదుపులోకితీసుకొని బేరసారాలు చేస్తుంటారు. చివరికి ఎంతోకొంత బంగారం ముట్టజెప్పనిది సీసీఎస్ గేటుదాటి బయటికి వచ్చే పరిస్థితే ఉండదు.
 

Advertisement
Advertisement