బాత్రూమ్‌లో ముద్దు ఇవ్వాలని బెదిరింపు..

6 Jan, 2020 14:20 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్‌ను విద్యార్థిని కుటుంబ సభ్యులు సోమవారం చితకబాదారు. బోథ్‌ హాస్టల్‌లో ఉంటున్న 10వ తరగతి విద్యార్థినిపై వార్డెన్‌ అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా దాడికి దిగారు. బాత్రూమ్‌లోకి వచ్చి ముద్దు ఇవ్వాలని విద్యార్థినిని హాస్టల్‌ వార్డెన్‌ బెదిరించాడు. ఈ క్రమంలో విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులతో వచ్చి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వార్డెన్‌ అటువైపు రావడంతో ఒక్కసారిగా విద్యార్థిని బంధువులు అతనిపై  దాడి చేయడంతో వార్డెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా