భర్తను కడతేర్చిన భార్య | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య

Published Sun, Aug 31 2014 3:02 AM

husband died wife

జగ్గయ్యపేట(కృష్ణా) :ఓ మహిళ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. వివరాలు.. బోదవా డ గ్రామానికి చెందిన దారావత్ కామేష్(32) పదమూడేళ్ల కిందట నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కృష్ణపట్నం తండాకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కు మారుడు ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో కొంతకాల ంగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మి గ్రామంలో ఒకరితో వివాహేతర సం బంధం ఏర్పరచుకుందని కామేష్‌కు ఇటీవల తెలిసింది. దీంతో అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 20న ఇద్దరి మ ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సమయం లో వైరుతో భర్త గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం వేకువజామున మూడు గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో నడుచుకుంటూ జగ్గయ్యపేట బయలుదేరింది.
 
 గొర్రెల కాపరులు ఇచ్చిన  సమాచారంతో..
 అదే సమయంలో గ్రామంలోని గొర్రెల పెంపకందార్లు శనివారం చిల్లకల్లులో జరిగే సంత కోసం బయలుదేరారు. లక్ష్మి పిల్లలతో వెళుతుండటాన్ని చూసి కామేష్ బంధువులకు సమాచారం అం దించారు. వారు అతడి ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా కామేష్ చని పోయి ఉన్నాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ఎస్సైలు నాగరాజు, శ్రీను షణ్ముఖసాయి, ఉమామహేశ్వరరావు సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీ లించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ చిన్నహుస్సేన్ కూ డా వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు గ్రామంలోని సుగాలీల కులదేవత సీత భవాని ఆలయంలో పురోహితుడు. కామేష్ కుమార్తె విజయవాడ సమీపంలో ఓ ప్రాంతంలోప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది.
 
 పోలీసుల అదుపులో నిందితురాలు
 ఈ ఘటనపై కేసు నమోదవగా పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. సీఐ ఆధ్వర్య ంలో ఎస్సై షణ్ముఖసాయి ప్రత్యేక బృం దంతో నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్నం వెళ్లారు. ఈలోగా లక్ష్మి పిల్లలతో సహా కృష్ణానదిలో దూకిందంటూ ప్రచారం జరిగింది. ఈ ఘటన జరిగిన ఏడు గం టల్లోనే ఆమెను పుట్టినింటిలో పోలీ సు లు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మితోపాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.
 

Advertisement
Advertisement