గొంతెండుతోంది | Sakshi
Sakshi News home page

గొంతెండుతోంది

Published Wed, May 7 2014 3:28 AM

IN karimnagar district peole are feeling difficulties for water

పల్లె గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం పల్లెవాసులు అల్లాడుతున్నారు. పనిచేయని రక్షితనీటి పథకాలు.. అసంపూ ర్తి ప్రాజెక్టులతో జిల్లాలోని వందలాది గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎండలు ముదురుతున్న కొద్దీ భూగర్భజలాలు ఇంకిపోతున్నా యి. 20 మండలాల్లో 10 మీటర్లకు పైగా జలాలు పడిపోగా ఈ నెల రోజుల్లోనే నాలుగు మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్ని చోట్ల భూగర్భజలాలున్నా... బోర్లు, మోటార్లు పనిచేయక తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉంది.
 
 సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని చాలా మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రస్తు తం నీటి ఎద్దడి ఉన్న మండలాల్లో ప్రజలకు గొంతు తడపడానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి రానుంది.  ప్రమాదాన్ని ముందే పసిగట్టాల్సిన జిల్లా యంత్రాంగం మొద్దు నిద్రపోయింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా.. ఇంత వర కు జిల్లాలో ఎక్కడా అసలు తాగునీటి సమస్య ఉత్పన్నమే కాలేదని, అందుకే తాము కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు వివరణ ఇవ్వడం గమనార్హం. భూగర్భజల శాఖ అధికారులు మా త్రం 20 మండలాల్లో నీటిమట్టం భూ ఉపరిత లం నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయింద ని, నెలరోజుల్లోనే 18 మండాల్లో మీటరు నుం చి నాలుగు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో 2463 తాగునీటి పథకాలున్నా... చాలా చోట్ల అవి పనిచేయక నీటి ఎద్దడి ఏర్పడుతోంది. కరెంట్ కోతలతో బోర్లు, నీటి పథకాలు పనిచేయక సిరగా   నీరందడం లేదు.
 
 మంచినీటి ఎద్దడి
 తీవ్రంగా ఉన్న గ్రామాలు
 జిల్లాలో అనేక గ్రామాల ప్రజలు గుక్కెడు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కథలాపూర్ మండలం దుంపేటలో రెండు వాటర్‌ట్యాంకు లు ఉన్నా నీరందించడం లేదు. మహాముత్తారం మండలం కనుకునూరు, కొత్తపల్లె, రెడ్డిపల్లె, రేకులగూడెం, పోచంపల్లి, బోర్లగూడెం గ్రామ పరిధిలోని దేవునితండాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. హుజూరాబాద్ పట్టణంతోపా టు  జమ్మికుంట, తనుగుల, నగరం, వావిలా ల, కొత్తపల్లి గ్రామాల్లో 50 వేల మంది ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు.
 
 ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, బండలింగపల్లి, గర్జనపల్లి, వేములవాడ మండలం నూకలమర్రి, కొల నూరు (కోనరావుపేట), మల్యాల (చందుర్తి), తాండ్య్రాల (కథలాపూర్), గోవిందారం, మన్నెగూడెం (మేడిపల్లి), ధర్మపురి మండల కేంద్రంతో పాటు నక్కలపేట గిరిజన తండా, దుగ్గారం, గైన, రాయపట్నం, రామయ్యపల్లె, గొల్లపల్లి, ఘన్‌పూర్, అగ్గిమళ్ల, గుంజపడుగు, గంగాపూర్ గ్రామాలు, వెల్గటూరు, గొడ్జెటపేట, పెండపల్లి, గుళ్లకోట, ధర్మారం, కొత్తపల్లె, కొడిమ్యాల, నమిలికొండ, శ్రీరాములపల్లి, నాచుపల్లి, సుడంపేటతండా వాసులకు తాగునీరు సరిగా అందడం లేదు. బోయినపల్లి, కటికెనపల్లి(చొప్పదండి), కోరుట్ల, జోగన్‌పల్లి, చిన్నమెట్‌పల్లి, మోహన్‌రావుపేట, మెట్‌పల్లి, అల్లూరితండా, రంగరావుపేటతండా, పాటిమీది తండా, మల్లాపూర్, కుష్టాపూర్, రత్నాపూర్, సంగెం, శ్రీరాంపూర్, పాతదంరాజ్‌పల్లి, కాటారం, జాదరావ్‌పేట, చింతకాని, శంకరంపల్లి (ఎస్సీ కాలనీ), పరికిపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
 
 ప్రతిపాదనలేవీ?
 తాగునీటి సమస్య పరిష్కారానికి ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో అధికారులు అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు. వేసవికాలం వచ్చినా ఎక్కడా బోర్‌వెల్‌ల మరమ్మతు చేయించలేదు. ట్యాంకులు ఏర్పాటు చేయలేదు. బావులు అద్దెకు తీసుకోలేదు. కాలిపోయిన మోటార్లు కూడా బాగు చేయించలేదు. పైప్‌లైన్ లీకేజీలు సరిచేసినవారే లేరు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 వేల బోర్లలో 12 వేల వరకు పనిచేయడం లేదు. బోర్‌వెల్‌ల నిర్వహణ బాధ్యత ఎంపీడీవోలదే అయినా చాలా మంది పట్టించుకోలేదు.
 
 మున్సిపాలిటీల్లోనూ అరిగోసే..
 తాగునీటి సమస్యలో గ్రామాలకు మున్సిపాలిటీలు తీసిపోవడం లేదు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే నీరు సరిగా అందడం లేదు. సిరిసిల్ల పరిధిలోని తారకరామనగర్, తుక్కరావుపల్లె, బీవైనగర్, సుందరయ్యనగర్‌లలో నీటి ఎద్దడి చాలా ఉంది.
 
 మెట్‌పల్లి పరిధి గాజులపేట, దుబ్బవాడ, ముస్లింపుర, సుల్తాన్‌పూర్, బుడిగజంగాలకాలనీ, బీడీ కాలనీ, చైతన్యనగర్‌లలో, కోరుట్ల పరిధి అర్బన్‌కాలనీ, హాజీపుర, శివాజీరోడ్డు, ఝాన్సీరోడ్, భీమునిపేట, జగిత్యాల పరిధి విజయపురి, విద్యానగర్, చిలుకవాడ, సాయిబాబా టెంపుల్ ఏరియా, కృష్ణానగర్ (గవర్నమెంట్ స్కూల్ ఏరియా), అరవింద్ ఏరియా, బుడిగజంగాల కాలనీ, గణేశ్ టెంపుల్ ఏరియా, గోత్రాలకాలనీ, తులసీనగర్, హౌజింగ్‌బోర్డు కాలనీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. రామగుండం నగర పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీ, పెద్దపల్లి పట్టణ ం బస్టాండ్ ఏరియా, రైల్వేస్టేషన్, ప్రగతినగర్, క్రిస్టియన్‌కాలనీ, భూమినగర్‌లో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
 

Advertisement
Advertisement