ఉద్యోగాల పేరిట మోసం | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట మోసం

Published Wed, Jul 8 2015 5:58 AM

In the name of employment fraud

♦ నిరుద్యోగులకు రూ.18.96లక్షల కుచ్చుటోపీ
♦ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
 
 కోల్‌సిటీ : ‘నాకు ఎమ్మెల్యేలు తెలుసు.. మంత్రులు బాగా పరిచయం.. ఎలాంటి ఉద్యోగమైనా ఇప్పిస్తా.. నన్ను నమ్మండి..’ అంటూనే నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు ఓ మోసగాడు. బాధితుడు కుక్కట్ల రమేష్ ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్‌కు చెందిన సన్నీ ఉరఫ్ పోతర్ల హరీష్ ఉరఫ్ కోమల్‌రెడ్డి గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన కుక్కట్ల రమేష్ సోదరుడు రాంకుమార్‌కు ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం రూ.2 లక్షలు వసూలు చేశాడు.

అలాగే స్థానిక కాకతీయనగర్‌లో లావణ్య అనే యువతికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7 లక్షలు, మామిడి శ్రీనివాస్‌కు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.70 లక్షలు, పెండ్యాల ప్రశాంత్‌కు అక్కడే ఇంకో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం సుమారు రూ.18.96లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో కుక్కట్ల రమేశ్ సన్నీని నిలదీశాడు. దీంతో సన్నీ కొద్దిరోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. తాము మోసపోయూమని గ్రహించిన రమేశ్.. పోలీసులను ఆశ్రరుుంచగా కేసు నమోదైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement