శాటి లైట్ టౌన్‌ పనులు అసంపూర్తిగానే... | Sakshi
Sakshi News home page

శాటి లైట్ టౌన్‌ పనులు అసంపూర్తిగానే...

Published Wed, Oct 29 2014 3:29 AM

incomplete tasks of satellite town

వికారాబాద్: ప్రభుత్వం విధించిన గడువు దాటి 11 నెలలైనా వికారాబాద్ శాటి లైట్ టౌన్‌కు సంబంధించిన వాటర్ సప్లయి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు,ఎస్టీపీ ప్లాంట్, వాటర్ ట్యాంకులు, సంపులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రభుత్వం 2012 జనవరి 4న ఓ కంపెనీకి పనులను అప్పగించింది. ఆ సంస్థకు కేటాయించిన గడువు రెండు సంవత్సరాలు కాగా అది పూర్తైదాదాపు ఏడాది అవుతున్నా చాలా పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.నత్తనడకన పనులు కొనసాగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

పనులను  పర్యవేక్షించాల్సిన  రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం తమకేమీ పట్టదన్నట్లుగా  గాలికొదిలేసిందని దుమ్మెత్తిపోస్తున్నారు. పైన  తెలిపిన పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.191 కోట్లను మంజూరు చేసి ఇందులో  పలు విడతలుగా పనులు జరిగినట్లు  బిల్లులను ఇచ్చుకుంటూ వస్తోంది.ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా   పనులను పూర్తి చేసినా  బిల్లులు మాత్రం రూ.70 కోట్ల వరకే ఇచ్చారని ఒక పక్క కంపెనీ అధికారులు పేర్కొంటుండగా పబ్లిక్‌హెల్త్ అధికారులు మాత్రం ప్రభుత్వం చేసిన పనులకే  బిల్లు ఇస్తోందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఇంకా రూ.30 కోట్ల బిల్లులను విడుదల చేయడం లేదని , దాంతో  గత ఆరు నెలల నుంచి పనులను నిలిపివేశామని ఆ కంపెనీ అధికారులే పేర్కొనడం గమనార్హం.

ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తిరిగి పెండింగ్ పనులను చేయాడానికి సిద్ధంగా ఉన్నామని,  లేదంటే పనులను ప్రారంభించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు  కేటాయించిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులను చెల్లిస్తే,  రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులను చెల్లించాల్సి ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను చెల్లించకపోవడంతోనే శాటిలైట్‌టౌన్ పనులు మధ్యలో ఆగిపోయిన్నట్లు ఆ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకపోగా చేసిన బిల్లులు రావడం లేదని  పనులను మధ్యలో ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రజలు,స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు పనులు పూర్తి అయింది  65 శాతమేనని ఒక పక్క స్థానిక నాయకులు,ప్రజలు పేర్కొం టు ండగా ప్రభుత్వ,కంపెనీ ఉద్యోగులు మా త్రం ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి అయ్యాయంటున్నారు. మిగిలిన పనులను మరో 6 నెలల్లో పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు.

2050 సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకునే..
2050 సంవత్సరంలో  పట్టణ జనాభా సుమారుగా 6 లక్షల వరకు ఉంటుందని అంచనాతో ఇంజనీర్లు పైపులైన్  ప్లాన్‌ను డిజైన్ చేశారు. ఈ మేరకు పట్టణంలో తాగు నీటి పైపులైన్ కోసం 117 కి.మీ. డిజైన్ చేయగా  ఇందులో ఇప్పటికింకా 17 కి.మీ.నిడివి అలాగే మిగిలిపోయింది. అక్కడక్కడా ఇంకా పైపులైన్‌లకు లిం కులు కలిపే పని అలాగే ఉంది.అంతే కాకుం డా పట్టణంలో  90 కి.మీ. యూజీడీని అధికారులు డిజైన్ చేయగా ఇందులో 69 కి.మీ. పనులు మాత్రమే పూర్తి అయినట్లు సమాచారం. పైపులైన్ల ఏర్పా టు కోసం సీసీ రోడ్లను పట్టణంలో అడ్డదిడ్డంగా తవ్వేశారు. తవ్వేసిన సీసీ రోడ్ల ప్యాచ్ వర్కులను మాత్రమే తాము చేస్తామని కాంట్రాక్టు సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా ఆర్‌అండ్‌బీ రోడ్లను సైతం సదరు కంపెనీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. వాటి మరమ్మత్తులు మాత్రం తాము చేసేది లేదని సదరు కంపెనీ పేర్కొంటోంది.

పూర్తి కాని ఎస్టీపీ...
పట్టణంలో వెలువడే మురుగు నీటిని వృథాబ చేయకుండా  శుభ్రపరిచి  తిరిగి వినియో గించుకునేందుకుగాను ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణంను ఆలంపల్లి సమీపంలోని మూసీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ  ప్లాంట్‌ను మూడు ప్రధాన పైప్‌లైన్లు రామయ్యగుడ, ఎన్నేపల్లి, మెయిన్‌టౌన్‌కు లింకు చేయనున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లలలో ఈ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా బీటీ రోడ్డు మధ్యలోనే ఏర్పాటు చేసేందుకు ఇంజి నీర్లు రూపకల్పన చేశారు. కానీ చివరకు ఏమైందో కాని రోడ్డుకు ఇరువైపుల యూజీడీని ఏర్పాటు చేశారు.సెప్టిక్ ట్యాంకుల నిర్మాణానికి సంబంధించి భారీ స్థాయిలో ఐదు చోట్ల నిర్మాణాలకు డిజైన్ చేశారు. ఇదిలా ఉంటే వాటర్,యూజీడీ పైపులైన్‌లు నిబంధనల ప్రకారం జరిగినట్లు లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇందులో ప్రధాన పైప్‌లైన్‌కు సంబంధించి 450 ఎంఎం డయా సామర్థ్యం గల పైప్‌ల నిర్మాణం చేపట్టగా చిన్న వీధుల గుండా 100ఎంఎం  నుంచి 400 ఎంఎం వరకు ఉన్న వివిధరకాల పైప్‌ల నిర్మాణం చేయాల్సి ఉండగా అలా జరగాలేదనే ఆరోపణలు స్థానిక ఇంజినీర్లనుంచి సైతం వ్యక్తమవుతున్నాయి. మొదటి విడత తాగునీటి పైప్‌లైన్ నిర్మాణం కోసం (డీఐ నాణ్యత కలిగిన )ఐరన్ పైప్‌లను మాత్రమే వాడాల్సి ఉండగా వేరే పైపులను వాడినట్లు స్పష్టమవుతోంది.ఈ విషయమై స్థానిక కౌన్సిలర్లు ఇటీవల విజిలెన్స్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థకు విడుదల కాకుండా ఆగిపోయినట్లు సమాచారం.
 
పూర్తికాని ట్యాంకుల నిర్మాణం
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంజినీర్లు పట్టణంలోని ఎత్తు ప్రదేశాల్లో ఆరు చోట్ల ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకుల నిర్మాణాలు చేపట్టారు.  కొత్తగడివార్డు,ఆరవ వార్డులోని ఏపీహెచ్‌బీ కాలనీ, ప్రశాంతినగర్, రాజీవ్‌నగర్, సింగారం కాలనీలతో పాటు బ్లాక్‌క్వార్టర్స్ (బాయ్స్ ఉన్నత పాఠశాల )సమీపంలో ఈ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టారు.ఈ పనులు  ఇప్పటివరకు పూర్తి కానేలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement